
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. బుధవారం రాత్రి మంత్రులు సర్వేకు సంబధించిన పూర్తి వివరాలను విడుదల చేశారు. ఇవి ప్రజలకు అందుబాటులో ఉండేలా https://des.telangana.gov.in/ అనే వెబ్‌సైట్‌లోనూ పొందుపర్చారు. ఇక సర్వేలోని వివరాలు చూసుకుంటే..రాష్ట్రవ్యాప్తంగా కోటి 12 లక్షల 36 వేల 849 కుటుంబాలను (97.10) సమగ్ర సర్వే చేసి మొత్తం 3 కోట్ల 55 లక్షల 50 వేల 759 మంది జనాభా వివరాలను ప్రభుత్వం సేకరించింది. ప్రభుత్వ కులగణన లెక్కల ప్రకారం రాష్ట్రం జనాభాలో అత్యధిక శాతం బీసీలు ఉన్నట్టు తెలుస్తోంది.
వివిధ సామాజిక వర్గాల జనాభా వివరాలు చూసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జనాభాలో బీసీలు – 56.36 శాతం మంది ఉండగా, ఎస్సీలు – 17.42 శాతం , ఎస్టీలు – 10.43 శాతం , ఓబీసీలు – 15.79 శాతం మంది ఉన్నారు. ఇక కులం లేదని చెప్పిన వారు 4 శాతం ఉన్నట్టు అధికారులు తెలిపారు. అయితే సమగ్ర కులగణన సర్వే లెక్కల ప్రకారం బీసీ కులాలలో టాప్ 20 జనాభా ఉన్న సామాజిక వర్గాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బీసీలలో ముదిరాజ్ సామాజికవర్గం 7.4 శాతం జనాభాతో మొదటి స్థానంలో ఉండగా, 0.2 శాతం జనాభాతో మేదరి సామాజికవర్గం 20వ స్థానంలో ఉంది.
ఇక అత్యధిక జనాభా ఉన్న టాప్ 20 కులాల ఏవని చూసుకుంటే. బీసీల్లో ముదిరాజ్‌లే ఎక్కువ ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 26 లక్షల 39 వేల మంది అంటే BC జనాభాలో 7.4శాతం ముదిరాజ్‌లు ఉన్నారు. ఆ తర్వాత స్థానం యాదవ, గొల్ల సామాజికవర్గానిని చెందిన 20 లక్షల 18 వేల 725 మంది ఉన్నారు. బీసీల్లో ఈ సమాజిక వర్గానికి చెందిన వారి సంఖ్య 5.7 శాతంగా ఉంది. ఇక బీసీల్లోని మరో కీలకమైన గౌడ కమ్యూనిటీ 3వ స్థానంలో ఉంది. ఈ కమ్యూనిటీలో సుమారు 16 లక్షల 30 వేల 187 మంది ఉన్నారు. తర్వాత మున్నూరు కాపు, 3.6 శాతంతో 13 లక్షల 75 వేల 18గా మంది ఉందగా. 11 లక్షల 82 వేల 252 మంది పద్మశాలి కుటుంబాల నుంచి ఉన్నారు.
ఇక.. రజకులు 9 లక్షల 95 వేల 972 మంది ఉంటే.. కురుమ, కురుబ సామాజికవర్గం వారు 7 లక్షల 95 వేల 822 మంది ఉన్నారు. ఒడ్డు , వడ్డెర కమ్యూనిటీ 6 లక్షల 43 వేలు ఉంటే అగ్నికుల క్షత్రియ వర్గానికి చెందిన వారు 5లక్షల 27 వేలు మంది ఉన్నారు. ఇక నాయి బ్రాహ్మణులు 4లక్షల 33 వేల మంది, కుమ్మర సమాజిక వర్గానికి చెందిన వారు 4 లక్షల 31 వేల మంది ఉన్నారు. అలాగే వడ్రంగి వాళ్లు 4 లక్షల 7వేల మంది, వాల్మీకి, బోయ సమాజిక వర్గానికి చెందిన వారు 3లక్షల 59 వేల మంది ఉన్నారు. అలాగే దూదేకుల వారు , 2లక్షల 69 వేలు , స్వర్ణకార వారు 2 లక్షల 48 వేలు, పెరిక వారు 2 లక్షల 30 వేలు, కమ్మరి వారు 1 లక్ష 65 వేలు, ఉప్పర వారు 1 లక్ష 24 వేలు, గంగి రెద్దుల వారు 92 వేల మంది, మేదరి సామాజిక వర్గానికి చెందిన వారు 77 వేల మంది ఉన్నారు.
ఇక సమగ్ర కులగణన సర్వే నివేదిక ప్రకారం మొత్తం జనాభాలో 10.3 శాతం జనాభా అంటే 36 లక్షల 57 వేలు మందితో మాదిగ సామాజికవర్గం టాప్ ప్లేస్‌లో ఉండగా. రెండో ప్లేస్‌లో ముదిరాజ్‌లు, మూడవ స్లేప్‌లో 3వ ప్లేస్‌లో లంబాడీ/బంజారా వాళ్లు ఉన్నారు. ఇక 4వ స్థానంలో యాదవులు, 5వ స్థానంలో తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. ఇక చివరగా 1.1 శాతం జనాభాతో గోండ్ సామాజికవర్గం 20వ స్థానంలో ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.