Telangana: చరిత్రలో తొలిసారి ట్రాన్స్‌జెండర్ మహిళకు CMRF సాయం

Telangana: ట్రాన్స్‌జెండార్‌ సంక్షేమం, ఆరోగ్య హక్కులు, సమాన అవకాశాల కల్పనలో ప్రభుత్వం ముందంజలో ఉందని క్వీర్‌ బంధు పేరెంట్స్‌ అసోసియేషన్‌ పేర్కొంది. ఇది గౌరవప్రద జీవనానికి మరో ముందడుగు అని, శస్త్రచికిత్స విజయవంతం కావడంతో అసోసియేషన్‌ ప్రతినిధులు ఓఎస్డీ వేముల శ్రీనివాసులను..

Telangana: చరిత్రలో తొలిసారి ట్రాన్స్‌జెండర్ మహిళకు CMRF సాయం
Tg Government

Updated on: Jun 03, 2026 | 8:19 AM

Telangana: ట్రాన్స్‌జెండర్‌ ఆరోగ్య హక్కుల కోసం తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వారి విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే చరిత్రలోనే తొలిసారి ట్రాన్స్‌జెండర్ మహిళకు CMRF సాయం అందింది. బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్సకు ఆర్థిక సహాయం అందించింది తెలంగాణ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో నిధుల మంజూరు అయ్యాయి. ట్రాన్స్‌జెండర్ ఆరోగ్య హక్కులకు తెలంగాణ ప్రభుత్వం అండ నిలువడం ట్రాన్స్‌జెండర్స్‌ ప్రశంసిస్తున్నారు.

ట్రాన్స్‌జెండార్‌ సంక్షేమం, ఆరోగ్య హక్కులు, సమాన అవకాశాల కల్పనలో ప్రభుత్వం ముందంజలో ఉందని క్వీర్‌ బంధు పేరెంట్స్‌ అసోసియేషన్‌ పేర్కొంది. ఇది గౌరవప్రద జీవనానికి మరో ముందడుగు అని, శస్త్రచికిత్స విజయవంతం కావడంతో అసోసియేషన్‌ ప్రతినిధులు ఓఎస్డీ వేముల శ్రీనివాసులను కలిసి ధన్యవాదాలు తెలిపారు. LGBTQ సమాజ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సందేశంతో ట్రాన్స్‌జెండర్ సాధికారతకు తెలంగాణలో మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి: Silver: ఇక వెండి కొనడం అంత సులభం కాదు.. కేంద్రం కీలక నిర్ణయం..!

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us