MP K Laxman: తెలంగాణలో రాష్ట్రపతి పాలన.. ఎన్నికల జరిగేది అప్పుడే: బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు 2029లో లోక్‌సభ ఎన్నికలతో పాటు జరగొచ్చని ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఆలస్యమైతే ఐదు నెలల పాటు రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుల అమలుతో 2029 ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒకేసారి జరుగుతాయని ఆయన అంచనా వేశారు.

MP K Laxman: తెలంగాణలో రాష్ట్రపతి పాలన.. ఎన్నికల జరిగేది అప్పుడే: బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌
Mp Laxman Comments On Telangana Elections 2029

Updated on: Nov 28, 2026 | 11:20 AM

దేశంలో జరగబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ ఎంపీ కే. లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరిగే లోక్‌సభ ఎన్నికలకు ఏడాది ముందుగానీ, వెనకగానీ జరుగుతున్నాయని.. కానీ ఈ సారి అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగొచ్చని ఆయన తెలిపారు. అంతేగాక తెలంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికలు 2028లో కాకుండా 2029లో జరగొచ్చని ఆయన చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల గడువు ముగిసిన తర్వాత మిగిలిన ఐదు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉండొచ్చన్నారు. కానీ ఇదే అంశంపై గతంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కారణంగా అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యమైతే, అప్పటివరకు తమ ప్రభుత్వమే కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎంపీ లక్ష్మణ్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉండగా ప్రతిపక్షాలపై కూడా విరుచుకుపడ్డారు ఎంపీ కే. లక్ష్మణ్. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి బిల్లునూ ‘ఇండియా’ కూటమి అడ్డుకోవాలని చూస్తుందని ధ్వజమెత్తారు. ఈ సారి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో కచ్చితంగా నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ప్రతిపాదించబోతుందని.. 2029 ఎన్నికల్లో మహిళా బిల్లు కచ్చితంగా అమలు చేసే విధంగా కేంద్రం చర్యలు చేపట్టిందన్నారు.

అంతేకాదు త్వరలో తెలంగాణలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటబోతుందని.. ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కచ్చితంగా కైవసం చేసుకుంటుందని ఎంపీ కే. లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us