Telangana Assembly: నేటి నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. అందరి దృష్టి ఈటెల పైనే.. ఎందుకంటే..

|

Mar 07, 2022 | 6:05 AM

Telangana Assembly Meeting: నేటి నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు. తొలిరోజే బడ్జెట్‌ను సమర్పించనున్నారు

Telangana Assembly: నేటి నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. అందరి దృష్టి ఈటెల పైనే.. ఎందుకంటే..
Telangana Assembly
Follow us on

Telangana Assembly Meeting: నేటి నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు. తొలిరోజే బడ్జెట్‌ను సమర్పించనున్నారు మంత్రి హరీష్‌రావు. ఆ తర్వాత జరిగే బీఏసీ మీటింగ్‌లో వర్కింగ్ డేస్‌పై స్పష్టత రానుంది.

కాగా, ఈ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం వివాదం, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఇష్యూ, రైతు సమస్యలు, జీవో 317..ఈ అంశాలే అస్త్రాలుగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్ధమయ్యాయి విపక్షాలు. ప్రతిపక్షం నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు ఇప్పటికే కసరత్తు పూర్తిచేసింది ప్రభుత్వం. అయితే, నేటి నుంచి జరిగే సభాపర్వం.. ఓ రేంజ్‌లో హీట్‌ను రాజేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇప్పటికే స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ప్రొటెం చైర్మన్ అమీనుల్ జాఫ్రీ స‌మీక్ష నిర్వహించి ఉన్నతాధికారుల‌కు సూచ‌న‌లు చేశారు. కోవిడ్ వ్యాప్తి అదుపులో ఉన్నా.. త‌గిన జాగ్రత్తలు తీసుకుంటూ ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. కోవిడ్ ప‌రీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసి అనుమానం ఉన్న వారికి ప‌రీక్షలు నిర్వహించాల‌న్నారు. సోమవారం ఉదయం నుంచి మొద‌ల‌య్యే ఉభ‌య స‌భ‌లు.. రెండు వారాల పాటు జ‌రిగే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొద‌టి రోజు ఉదయం 11:30కి ఆర్థిక మంత్రి హరీష్‌రావు బడ్జెట్ ప్రవేశపెడతారు. అనంత‌రం జ‌రిగే బీఏసీ స‌మావేశంలో అసెంబ్లీ ప‌నిదినాల‌పై స్పష్టత వస్తుంది.

సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రతిపక్షాలు ఇప్పటికే సమావేశాలు నిర్వహించాయి. కాంగ్రెస్ ముఖ్యంగా రైతు సమస్యలపై ఫోకస్ చేస్తోంది. ఇప్పటికే ఆ దిశగా కార్యాచరణ ప్రకటించారు. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క కూడా పీపుల్స్‌మార్చ్‌ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇవాళ జరిగిన సీఎల్పీ మీటింగ్‌లో సభావ్యూహాన్ని ఖరారు చేశారు. అటు ఈ సెషన్స్‌లో పంజాగుట్ట అంబేడ్కర్ విగ్రహం గురించి మాట్లాడాలంటూ సీఎల్పీకి లేఖ రాశారు వీహెచ్.

ఇక మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్‌ ఇష్యూని స‌భ‌లో ప్రస్తవించాలని బీజేపీ భావిస్తోంది. పార్టీ నేతలపై వచ్చిన ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టాల‌ని ఎమ్మెల్యేల‌కు సూచించారు బండి సంజ‌య్. గవర్నర్ ప్రసంగం లేకపోడవడం, 317 జీవో, నిర్యుదోగ్య సమస్య, డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు, కొత్త పింఛ‌న్ల అంశాల‌పై గట్టిగా ప్రశ్నించాలని నిర్ణయించారు. ఇక బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈట‌ల రాజేంద‌ర్‌ తొలిసారి అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రుకానున్నారు. ఇదే సభలో మంత్రిగా పనిచేసిన ఈటల ఇప్పుడు ప్రతిపక్షస్థానంలో కూర్చొని ప్రశ్నలు సంధించాల్సి ఉంటుంది.

Also read:

అమ్మాయిలకు గమనిక.. వేసవిలో అందంగా కనిపించాలంటే ఈ తప్పులు చేయకండి..!

Eyesight: చిన్న వయసులోనే కళ్లు దెబ్బతినడానికి కారణం ఏంటో తెలుసా..!

పాఠశాలకు వెళ్లి ఇంటికి రాలేదు.. చెరువు గట్టుపై స్కూల్ బ్యాగ్స్.. ఇంతకీ వాళ్లు ఎక్కడికి వెళ్లారు..?