Telangana: ఇదేం విచిత్రం.. లోపల లోపలే కాలిపోయిన మర్రిచెట్టు..

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు హైవే పక్కన ఉన్న ఒక మర్రిచెట్టు లోపలి నుంచి కాలిపోయింది. బయటికి పచ్చగా కనిపించినా, లోపల పూర్తిగా దహనమైంది. స్థానికులు పొగలను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ, అగ్నిప్రమాదానికి గల కారణాలు అంతుచిక్కడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Telangana: ఇదేం విచిత్రం.. లోపల లోపలే కాలిపోయిన మర్రిచెట్టు..
Banyan Tree Fire

Updated on: Oct 05, 2026 | 12:16 PM

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మదనపల్లి సమీపంలో హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి పక్కన ఉన్న ఒక పెద్ద మర్రిచెట్టు లోపలి నుంచి అగ్నికి ఆహుతైంది. బయటికి పచ్చగా, ఆరోగ్యంగా కనిపించినప్పటికీ, చెట్టు లోపలి భాగం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటన స్థానికులను, పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. మర్రిచెట్టు నుండి పొగలు రావడాన్ని గమనించిన అక్కడి లోకల్ ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే స్పందించి ఫైర్ సర్వీసెస్ సిబ్బందిని ఘటనా స్థలానికి పిలిపించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. చెట్టు పక్కనే ఆంజనేయ స్వామి వారి గుడి ఉండటం విశేషం.

ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఎవరైనా దుండగులు పెట్రోల్ వంటి పదార్థాలతో నిప్పంటించారా లేదా దానంతట అదే లోపల నుంచి అంటుకుందా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంత పచ్చగా ఉన్న చెట్టు సహజంగానే కాలిపోయే అవకాశం లేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వెనుక ఉన్నవారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

 ఓరి మీ మాయ పాడుగాను.. కుక్క, గేదె చర్మాలకు చారలు వేసి.. 

Loading...
Unable to load recommendations.
Follow Us