Breaking news: మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని ఆటో ఢీ కొట్టడంతో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. జిల్లాలోని గూడూరు మండలంలోని మర్రిమిట్టలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తుంది. వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. . మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :