Hyderabad: ట్రాక్ తప్పిన ఖా’కీచకుడు’.. మైనర్ బాలికను ట్రాప్ చేసి..

జనాలకు రక్షణగా నిలవాల్సిన ఓ కానిస్టేబుల్ గతి తప్పాడు. ఓ మైనర్ బాలికను ట్రాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. మైనర్లను టార్గెట్ చేసి.. వారి ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడు ఈ కీచకుడు. తాజాగా ఇంటర్ చదివే బాలికను ఇలానే బెదిరించి.. అత్యాచారం చేశాడు. బాధితురాలు, తన తల్లి సాయంతో పోలీసులుకు ఫిర్యాదు చేసింది. 2020 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ ప్రదీప్ గతంలో రాజేంద్రనగర్, కొంపల్లి, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్లలో పని చేశాడు.

Hyderabad: ట్రాక్ తప్పిన ఖా'కీచకుడు'.. మైనర్ బాలికను ట్రాప్ చేసి..
Rajendranagar Police Station Constable
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 27, 2024 | 6:15 PM

జనాలకు రక్షణగా నిలవాల్సిన ఓ కానిస్టేబుల్ గతి తప్పాడు. ఓ మైనర్ బాలికను ట్రాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. మైనర్లను టార్గెట్ చేసి.. వారి ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడు ఈ కీచకుడు. తాజాగా ఇంటర్ చదివే బాలికను ఇలానే బెదిరించి.. అత్యాచారం చేశాడు. బాధితురాలు, తన తల్లి సాయంతో పోలీసులుకు ఫిర్యాదు చేసింది. 2020 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ ప్రదీప్ గతంలో రాజేంద్రనగర్, కొంపల్లి, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్లలో పని చేశాడు. ప్రస్తుతం అతడు శంషాబాద్ ఆర్.జి.ఏ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్నాడు. అయితే రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న క్రమంలో స్థానికంగా ఉండే ఓ బాలికను ప్రదీప్ ట్రాప్ చేశాడు.

ఇంటికి ఎదురుగా ఉన్న మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పాడు. చర్చికి వెళ్లే సమయంలో చనువు పెంచుకుని.. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. తన భార్యకు పిల్లలు పుట్టరని ఆమెను వదిలేస్తానని చెప్పుకొచ్చాడు. ఆపై మైనర్‌పై లైంగిక దాడి చేసి.. ఆ దృశ్యాలు రికార్డు చేశాడు. వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ.. పలుమార్లు అత్యాచారం చేసినట్లు తెలిపారు బాధితురాలి తల్లి. శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలిక ప్రవర్తనలో మార్పులు గమనించిన పేరెంట్స్.. గట్టిగా అడగడంతో విషయం చెప్పిందంటున్నారు తల్లిదండ్రులు. దీంతో బాధితులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రదీప్ గతంలో కూడా ఇలా లైంగిక వేధింపులకు పాల్పడి సస్సైండ్ అయినట్లు తెలిసింది. కానిస్టేబుల్‌ ప్రవర్తనపై ఉన్నతాధికారులు సీరియస్‌ యాక్షన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..