నాగర్ కర్నూల్, జూన్ 25: తెలంగాణ బీజేపీలో.. కొన్ని రోజులుగా జరుగుతున్న నాటకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. నాగర్ కర్నూల్ నవసంకల్ప సభలో పాల్గొనేందుకు వచ్చిన జేపీ నడ్డా.. ఒక్క నిముషం కూడా గ్యాప్ లేకుండా బిజీగా ఉన్నారు. వరుస భేటీలతో.. నేతలకు దిశానిర్దేశం చేశారు. జేపీ నడ్డాతో ప్రొఫెసర్ నాగేశ్వర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించినట్టు తెలుస్తోంది. అయితే అలాంటిదేమీ లేదంటున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్. మోడీ ప్రభుత్వ పాలన గురించి తనకు నడ్డా వివరించారనీ.. తన అభిప్రాయలను కూడా నడ్డాతో పంచుకున్నా అంటున్నారాయన. జేపీ నడ్డాతో ప్రొఫెసర్ నాగేశ్వర్ భేటి తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వ పాలన గురించి తనకు నడ్డా వివరించారని అన్నారు.
దేశ వ్యాప్తంగా చాలా మందిని కలుస్తున్నారు.. అందులో భాగంగానే తనను కలిశారన అన్నారు. తన అభిప్రాయం కూడా నడ్డాతో పంచుకునట్లుగా తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇలా కలవడం మంచిదన్న అభిప్రాయాన్ని ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యక్తం చేశారు. తమ సిద్దాంతాలు వేరైనా అభిప్రాయాలు పంచుకోవడం మంచి పరిణామం అని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు.
తాను చర్చల కోసం వచ్చిన భేటీ కాదన్నారు. నడ్డ కలిసిన తరవాత అయిన కలవక ముందు అయిన ఓకే అభిప్రాయన్ని వ్యక్తం చేస్తున్నాని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. రష్యాతో చమురు కొనడానికి ఎప్పుడైనా మంచిదని.. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తానాని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. అయితే, పెట్రోల్, డీజల్ పై సేస్ పెంచడాన్ని తప్పు పడుతానని అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం