AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై అభ్యంతరకర స్కిట్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అభ్యంతకర స్కిట్‌ కేసులో మరో ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు. ఆర్టిస్ట్ బరుపట్ల రాజును A5 గా చేర్చి అరెస్టు చేశారు హయత్ నగర్ పోలీసులు..

CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై అభ్యంతరకర స్కిట్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్
Subhash Goud
| Edited By: |

Updated on: Jun 29, 2022 | 7:54 PM

Share

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అభ్యంతకర స్కిట్‌ కేసులో మరో ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు. ఆర్టిస్ట్ బరుపట్ల రాజును A5 గా చేర్చి అరెస్టు చేశారు హయత్ నగర్ పోలీసులు. ఇక A6 గా డాన్సర్ కొమ్ము శ్రీరాములును చేర్చి అరెస్ట్ చేశారు పోలీసులు. జూన్ 2న సీఎం కేసీసీఆర్‌పై స్కిట్ వేసి అగౌరవపరిచారంటూ టీఆర్‌ఎస్‌ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ కేసులో A1గా బండి సంజయ్, A2 గా జిట్టా బాలకృష్ణ, A3 రాణి రుద్రమ, A4దరువు ఎల్లన్నలను చేర్చారు.ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు.

కాగా, సూర్యపేట జిల్లా నూతన్‌కల్‌ మండలం మిర్యాల గ్రామానికి చెందిన కొమ్ము శ్రీరాములు, వరంగల్‌ జిల్లా ఖిల్లా పరిధిలో దూపకుంటకు చెందిన బరుపట్ల రాజు అలియాస్‌ రవిలను పోలీసులు అరెస్టు చేశారు.ఈనెల 2న తెలంగాణ ఆవిర్బావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ నిర్వహించిన నాటకంలో సీఎం కేసీఆర్‌ను కించపర్చేలా ఈ ఇద్దరు కళాకారులు స్కిట్‌ చేశారని వారిని అరెస్టు చేశారు. ఇలా కేసీఆర్‌ను కించపర్చే విధంగా స్కిట్‌ చేశారనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్‌ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేతలు ఈ నాటకంలో తప్పుడు ప్రచారం చేశారని టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కేసీఆర్‌పై వ్యక్తిగతంగా దాడులకు దిగారని టీఆర్ఎస్‌ నేతలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!