ఇలాంటి అవ్వ నూటికో.. కోటికో ఒక్కరే.. సొంతూరి బాగు కోసం వృద్దురాలి ఆరాటం..!

వయసు మీదపడినా ఆ అవ్వ ఆలోచన మాత్రం తన సొంత ఊరి అభివృద్ధి చుట్టూనే తిరుగుతోంది. తనకు పింఛన్ కావాలనో, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలనో, రేషన్ కార్డు కావాలనో ఆమె కలెక్టరేట్ మెట్లు ఎక్కలేదు. తన గ్రామానికి మెరుగైన రహదారి సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి (గ్రీవెన్స్‌) కార్యక్రమానికి హాజరై అధికారులకు వినతిపత్రం సమర్పించింది.

ఇలాంటి అవ్వ నూటికో.. కోటికో ఒక్కరే.. సొంతూరి బాగు కోసం వృద్దురాలి ఆరాటం..!
Elderly Woman Seeks Better Roads

Updated on: Oct 26, 2026 | 4:58 PM

జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 26: వయసు మీదపడినా ఆ అవ్వ ఆలోచన మాత్రం తన సొంత ఊరి అభివృద్ధి చుట్టూనే తిరుగుతోంది. తనకు పింఛన్ కావాలనో, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలనో, రేషన్ కార్డు కావాలనో ఆమె కలెక్టరేట్ మెట్లు ఎక్కలేదు. తన గ్రామానికి మెరుగైన రహదారి సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి (గ్రీవెన్స్‌) కార్యక్రమానికి హాజరై అధికారులకు వినతిపత్రం సమర్పించింది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం ఆజంనగర్‌కు చెందిన వృద్ధురాలు మాంతు లక్ష్మి సోమవారం (అక్టోబర్ 26) కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవెన్స్‌లో తన గ్రామానికి రహదారులు మంజూరు చేయాలని కోరింది. రాంపూర్‌ నుంచి ఆజంనగర్‌ వరకు డబుల్‌ రోడ్డు నిర్మించాలని, ఆజంనగర్‌ నుంచి బోర్లగూడెం వరకు, వేములపల్లి నుంచి ఆజంనగర్‌ వరకు కూడా డబుల్‌ రోడ్లు మంజూరు చేయాలని దరఖాస్తులో విజ్ఞప్తి చేసింది.

జిల్లా రెవెన్యూ అధికారి వసంతకుమార్‌కు ఆమె వినతిపత్రం అందజేయగా, తన వ్యక్తిగత అవసరాలను పక్కనపెట్టి గ్రామం కోసం రోడ్లు కోరడం అధికారిని ఆకట్టుకుంది. ఈ వయసులోనూ ఊరి అభివృద్ధి కోసం ఆరాటపడుతున్న లక్ష్మిని అభినందించారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి సామాజిక బాధ్యతతో ఆలోచించాలని ప్రశంసించారు.

అనంతరం సంబంధిత పంచాయతీరాజ్‌ ఈఈని పిలిపించి, వృద్ధురాలు సమర్పించిన దరఖాస్తును అందజేసి పరిశీలించాలని ఆదేశించారు. తన ఊరి ప్రజలకు రాకపోకలు సులభం కావాలన్న లక్ష్మి ప్రయత్నం పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది. రోడ్ల నిర్మాణానికి సంబంధించి అధికారుల పరిశీలన అనంతరం తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us