Telangana: నిజామాబాద్‌లో దారుణం.. పండ్ల రసం కొనిస్తానంటూ తీసుకెళ్లి బాలికపై అఘాయిత్యం..

Girl raped in Nizamabad: దేశంలో నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నప్పటికీ.. మహిళలు, చిన్నారులపై కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా.. ఓ వ్యక్తి పండ్ల రసం కొనిస్తానంటూ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి..

Telangana: నిజామాబాద్‌లో దారుణం.. పండ్ల రసం కొనిస్తానంటూ తీసుకెళ్లి బాలికపై అఘాయిత్యం..

Updated on: Apr 24, 2022 | 12:41 PM

Girl raped in Nizamabad: దేశంలో నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నప్పటికీ.. మహిళలు, చిన్నారులపై కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా.. ఓ వ్యక్తి పండ్ల రసం కొనిస్తానంటూ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. 9 ఏళ్ల బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘోర ఘటన నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్‌పల్లి (jakranpally) లో ఆలస్యంగా వెలుగుచూసింది. నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్‌పల్లి మండలంలో తొమ్మిదేళ్ల బాలికపై నారాయణ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు నెలల క్రితం ఉపాధి కోసం వేరే ప్రాంతం నుంచి ఓ వ్యక్తి కుటుంబంతో మండల కేంద్రానికి వలస వచ్చాడు. శివారు ప్రాంతంలో గుడిసె వేసుకొని భార్యా, బాలికతో కలిసి నివసిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఆ వ్యక్తి.. భార్య, కూతురిని వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో సమీప గ్రామంలోని విత్తనోత్పత్తి కేంద్రంలో కూలీగా చేస్తూ తల్లి తన కూతురితో అక్కడే ఉంటోంది.

అయితే.. రోజు మాదిరిగానే ఆమె కుమార్తెను శుక్రవారం ఇంట్లో వదిలేసి పనికి వెళ్లింది. దీన్ని గమనించిన నారాయణ అనే వ్యక్తి బాలికను పండ్ల రసం కొనిస్తానంటూ చెప్పి తీసుకెళ్లాడు. అనంతరం సమీపంలోని కొండ ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. సాయంత్రం ఇంటికొచ్చిన తల్లి.. కూతురు కనిపించకపోవడంతో చుట్టుపక్కల గాలించింది. ఈ క్రమంలో నిందితుడు చిన్నారితో కనిపించాడు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది.

కాగా.. బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ నారాయణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిచ్‌పల్లి పోలీసులు వెల్లడించారు.

Also Read:

Crime News: మద్యం కోసం కన్నతల్లినే కడతేర్చాడు.. రూ.100 ఇవ్వలేదని దారుణంగా..

Rajasthan: రాజస్థాన్‌లో అమానుషం.. దళిత వధూవరులను ఆలయంలోకి రానీయకుండా అడ్డుకున్న పూజారి!