Car Loans : కొత్తగా కారు కొనాలనుకునే వారికి శుభవార్త..తక్కువ వడ్డీ రేట్లకే రుణాలిస్తున్న బ్యాంకులు

ఈ కరోనా మహమ్మారిని సమర్థవంతంగా తరిమికొట్టే వ్యాక్సిన్ అతి త్వరలో వస్తుందన్న ఆశతో న్యూ ఇయర్‌లోకి అడుగుపెట్టాం. ఈ క్రమంలో మీరు ఈ ఏడాది  కొత్తగా కారు కొనాలని ఫిక్సయ్యారా? అయితే మీకు గుడ్ న్యూస్.

Car Loans : కొత్తగా కారు కొనాలనుకునే వారికి శుభవార్త..తక్కువ వడ్డీ రేట్లకే రుణాలిస్తున్న బ్యాంకులు
Follow us

|

Updated on: Jan 01, 2021 | 9:00 PM

ఈ కరోనా మహమ్మారిని సమర్థవంతంగా తరిమికొట్టే వ్యాక్సిన్ అతి త్వరలో వస్తుందన్న ఆశతో న్యూ ఇయర్‌లోకి అడుగుపెట్టాం. ఈ క్రమంలో మీరు ఈ ఏడాది  కొత్తగా కారు కొనాలని ఫిక్సయ్యారా? అయితే మీకు గుడ్ న్యూస్. కారు కొనాలని భావించే వారికి బ్యాంకులు తక్కువే వడ్డీకే లోన్స్ ఇస్తున్నాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కారు కొనేందుకు చాలా తక్కువ వడ్డీకే లోన్స్ ఇస్తున్నాయి.

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కారు కొనడానికి లోన్ తీసుకుంటే వడ్డీ రేటు 7.7 శాతం నుంచి స్టార్ట్ అవుతుంది. తీసుకున్న లోన్ 74 నెలలలోగా తిరిగి చెల్లించొచ్చు. ప్రాసెసింగ్ ఫీజు రూ.1,000 నుంచి ప్రారంభమవుతుంది. కారు ఆన్‌రోడ్ ధరలో 90 శాతం వరకు లోన్ వస్తుంది. యోనో యాప్‌తో అయితే 7.5 శాతం వడ్డీకే లోన్ దక్కించుకోవచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కారు కొనడానికి లోన్ తీసుకుంటే 8.8 శాతం వడ్డీని ఛార్జ్ చేస్తోంది. ప్రాసెసింగ్ ఫీజు.. లోన్ నగదు మొత్తంలో 0.4 శాతంగా ఉంటుంది. తీసుకున్న లోన్ 84 నెలల లోగా తిరిగి చెల్లించొచ్చు. ఏకంగా రూ.3 కోట్ల వరకు లోన్ పొందొచ్చు.

ఇక  ఐసీఐసీఐ బ్యాంక్‌లో మీరు కారు లోన్‌పై ఇంట్రస్ట్ రేటు  8 శాతంగా ఉంది. కారు మోడల్‌ను బట్టి మీకు లభించే లోన్ మొత్తం మారుతుంది. తీసుకున్న రుణాన్ని 84 నెలలలోగా తిరిగి పే చేయాలి. ఐసీఐసీఐ కొంతమందికి ప్రి అప్రూవ్డ్ లోన్స్ కూడా ఇస్తుంది.

ఇక  పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో కారు రుణాలపై ఇంట్రస్ట్ రేటు 7.3 శాతం నుంచే స్టార్టవుతుంది. డిఫెన్స్, పారా మిలిటరీ వారికి ఈ వడ్డీ రేట్లు అందుబాటులో ఉన్నాయి. మహిళలు అయితే 7.55 శాతం వడ్డీ రేటుకు కార్ లోన్ తీసుకోవచ్చు. ఇతరులకు ఇంట్రస్ట్ రేట్లు 7.55 శాతం నుంచి 7.8 శాతం వరకు ఉంటాయి.