తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. తెలంగాణలో ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) శుక్రవారం వైద్య, ఆరోగ్య శాఖలో వివిధ స్థాయిల్లో 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల ప్రత్యక్ష నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. MHSRB నోటిఫై చేసిన 5,204 స్టాఫ్ నర్సుల పోస్టులలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్/ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ కింద 3,823 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP)లో 757 పోస్టులు ఉన్నాయి. ఎంఎన్‌జే ఆస్పత్రిలో 81 పోస్టులు సహా.. వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేసేలా ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది.
రాష్ట్రంలో ఉద్యోగ ప్రకటనల పరంపర కొనసాగుతోంది. తాజాగా గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. స్టేట్‌లోని 26 విభాగాల్లో 1,365 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనౌన్సిమెంట్ వచ్చేసింది. ఆర్థిక శాఖలో ఎక్కువగా 712 పోస్టులు ఉన్నాయి. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను తీసుకోనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 జాబ్స్ భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు రిలీజైన సంగతి తెలిసిందే.
ఏజ్ లిమిట్ దాటిన కొందరు అభ్యర్థులకు నష్టం జరిగే చాన్స్ ఉన్నందున.. TSPSC వరుస నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఎక్కువ మంది అభ్యర్థులు అన్ని ఎగ్జామ్స్‌లో పోటీ పడే చాన్స్ ఉన్నందున.. పరీక్షల మధ్య గడువు ఇవ్వాలని TSPSC భావిస్తోంది. అందుకే నోటిఫికేషన్లతో పాటు ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేయడం లేదు.