AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. నర్సాపూర్‌లో అదుపుతప్పిన స్కూల్ బస్సు!

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. శ్రీ వాత్సల గురుకుల పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు డ్రైవర్‌కు మార్గమధ్యలో అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో బస్సు అదుపుతప్పింది. దీంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న గూడ్స్ ఆటోను, ఆ తర్వాత ఒక బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఆటో, బైక్ వద్ద ఎవరూ లేకపోవడంతో పాటు, బస్సు ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితిపై, విద్యార్థుల భద్రతపై ఈ ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. నర్సాపూర్‌లో అదుపుతప్పిన స్కూల్ బస్సు!
School Bus Accident
P Shivteja
| Edited By: |

Updated on: Nov 14, 2026 | 7:03 PM

Share

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్‌కు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన పార్క్ చేసి ఉన్న గూడ్స్ ఆటోను ఢీకొట్టి, అనంతరం బైక్‌పైకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..

మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సంగారెడ్డి ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీ వాత్సల గురుకుల పాఠశాలకు చెందిన బస్సు పాఠశాల ముగిసిన అనంతరం విద్యార్థులను వారి ఇళ్లకు తీసుకెళ్తోంది. అల్లిపూర్‌కు చెందిన చింతకింది ప్రభాకర్ బస్సు నడుపుతుండగా.. మార్గమధ్యలో ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో బస్సుపై నియంత్రణ కోల్పోయాడు.. దీంతో అదుపుతప్పిన బస్సు రోడ్డుపక్కన పార్క్ చేసి ఉన్న గూడ్స్ ఆటోను బలంగా ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా పక్కనే ఉన్న బైక్‌పైకి దూసుకెళ్లింది..ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరా లో రికార్డ్ అయ్యింది..కాగా ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో బస్సులో ఉన్న విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

బైక్‌ను ఢీకొన్న అనంతరం బస్సు ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని మరో బస్సులో వారి ఇళ్లకు తరలించారు..అయితే ప్రమాద సమయంలో గూడ్స్ ఆటో, బైక్ వద్ద ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పిందని స్థానికులు తెలిపారు. డ్రైవర్‌కు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విద్యార్థులతో ప్రయాణించే స్కూల్ బస్సుల డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితి, భద్రతా ప్రమాణాలపై ఈ ఘటన మరోసారి ఆందోళన కలిగిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us