Mahesh Kumar Goud: తెలంగాణలో మరోసారి అధికారంలోకి రావడంపై కీలక వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్
Mahesh Kumar Goud: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటీలు అమలు తీరుపై వచ్చిన విమర్శలను మహేష్ కుమార్ గౌడ్ తిప్పికొట్టారు. కొన్ని పథకాలు పూర్తిస్థాయిలో అమలవకపోయినా, మెజారిటీ హామీలను అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. ముఖ్యంగా, మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి..
Mahesh Kumar Goud: తెలంగాణలో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడం, రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేయడమే తమ ఏకైక లక్ష్యమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నేత మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. టీవీ9 తెలుగు నిర్వహించిన క్రాస్ ఫైర్ కార్యక్రమంలో సీఈవో రజనీకాంత్ మహేష్‌గౌడ్‌ను ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో భాగంగా టీపీసీసీ పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలంగాణ రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ పనితీరు, భవిష్యత్ సవాళ్లపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
తన వ్యక్తిగత ఆకాంక్షల గురించి మాట్లాడుతూ, తాను మంత్రి పదవిని ఆశించడం లేదని మహేష్ కుమార్ గౌడ్ ఖచ్చితంగా చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగడమే తన కోరిక అని పునరుద్ఘాటించారు. కొండా సురేఖ విషయంలో జరుగుతున్న చర్చల గురించి ప్రస్తావిస్తూ, ఆమె తన సోదరి అని, ఆ విషయంపై ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) తుది నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అయితే కొండా సురేఖ స్థానంలో మంత్రి పదవిని ఆఫర్ చేసినా తాను తిరస్కరిస్తానని, అలాంటి దీనస్థాయిలో తాను లేనని ఆయన స్పష్టం చేశారు.
