Warangal BRS: వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్‌.. ప్రకటించిన అధినేత కేసీఆర్

| Edited By: Balaraju Goud

Apr 12, 2024 | 6:34 PM

ఎట్టకేలకు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు అయ్యింది. రిజర్వ్ నియోజకవర్గం అయిన వరంగల్ లోక్‌సభ స్థానం నుండి పార్టీ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్‌ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు అందరితో చర్చించి వారి సలహా సూచనలమేరకు అధినేత కేసీఆర్, సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ప్రకటించారు.

Warangal BRS: వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్‌.. ప్రకటించిన అధినేత కేసీఆర్
Dr.marepalli Sudhir Kumar
Follow us on

ఎట్టకేలకు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు అయ్యింది. రిజర్వ్ నియోజకవర్గం అయిన వరంగల్ లోక్‌సభ స్థానం నుండి పార్టీ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్‌ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. హన్మకొండ జిల్లా వాసి, మాదిగ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు.

2001 నుండి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీ కి విధేయుడుగా, అధినేతతో కలిసిపనిచేస్తున్న సుధీర్ కుమార్ సరైన అభ్యర్ధిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మేరకు అందరితో చర్చించి వారి సలహా సూచనలమేరకు అధినేత కేసీఆర్, సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ప్రకటించారు.

బీఆర్‌ఎస్‌ వరంగల్‌ అభ్యర్థి ప్రకటనలో అధినేత కేసీఆర్ సమక్షంలో హైడ్రామా కొనసాగింది. ఉదయం కేసీఆర్‌ నుంచి మాజీ మంత్రి తాటికొండ రాజయ్యకు పిలుపు వచ్చింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌‌లో కేసీఆర్‌ను కలవకండా తన ఫామ్‌హౌస్‌కి వెళ్లిపోయారు రాజయ్య. వరంగల్ జిల్లాకు చెందిన కీలక నేతలతో సుదీర్ఘంగా చర్చించారు కేసీఆర్. అనంతరం వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా సుధీర్‌కుమార్‌ పేరు ఖరారు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.

ఉద్యమ నేతగా రాజకీయాల్లోకి వచ్చి సుధీరకుమార్ అంచెలంచెలుగా ఎదుగుతూ హన్మకొండ జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. తొలుత 1995 ముల్కనూర్ ఎంపీటీసీ సభ్యులుగా విజయం సాధించి భీమదేవరపల్లి మండల పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 2001 స్థానిక సంస్థల ఎన్నికల్లో భీమదేవరపల్లి జెడ్పీటీసీగా గెలుపొందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వైస్ చైర్మన్‌గా విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో ఎల్కతుర్తి జెడ్పీటీసీగా గెలుపొందిన సుధీర్ కుమార్ హనుమకొండ జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…