Hyderabad: విద్యార్థులు తినబోతుండగా కూరలో కనిపించిన వింత వస్తువు.. చివరికి ఏమైందంటే?

హైదరాబాద్: కూకట్‌పల్లిలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) మంజీరా హాస్టల్‌లో విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతపై మరోసారి ఆందోళన వ్యక్తమైంది. హాస్టల్‌లో గత రాత్రి డిన్నర్ చేసేందుకు వెళ్లిన విద్యార్థులకు వడ్డించిన కూరలో బల్లి కనిపించడం కలకలం రేపింది. దీంతో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.

Hyderabad: విద్యార్థులు తినబోతుండగా కూరలో కనిపించిన వింత వస్తువు.. చివరికి ఏమైందంటే?
Lizard Found In Food

Updated on: Oct 30, 2026 | 10:38 AM

హైదరాబాద్: కూకట్‌పల్లిలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) మంజీరా హాస్టల్‌లో విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతపై మరోసారి ఆందోళన వ్యక్తమైంది. హాస్టల్‌లో గత రాత్రి డిన్నర్ చేసేందుకు వెళ్లిన విద్యార్థులకు వడ్డించిన కూరలో బల్లి కనిపించడం కలకలం రేపింది. దీంతో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.

విద్యార్థులు భోజనం చేస్తుండగా కూరలో బల్లి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే కొందరు విద్యార్థులు తమ సెల్‌ఫోన్లలో ఈ ఘటనను వీడియో తీశారు. తినే ఆహారంలో బల్లి కనిపించడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్‌లో అందిస్తున్న భోజనం నాణ్యత, వంటగది పరిశుభ్రతపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం ఆడవద్దని, హాస్టల్‌లో నాణ్యమైన భోజనం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆహారం తయారుచేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని, వంటగది పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు.

విద్యార్థులకు అందించే భోజనాన్ని అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై యూనివర్సిటీ అధికారులు స్పందించి, ఆహార నాణ్యతపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై యూనివర్సిటీ అధికారుల అధికారిక స్పందన రావల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us