AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. పార్లమెంట్‌లో మెరిసిన కరీంనగర్ స్టూడెంట్.. మాటలతో అదరగొట్టిన శ్రీనిత్య..

గల్లీ నుంచి ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్ వరకు.. కరీంనగర్ అమ్మాయి అద్భుత ప్రతిభకు దేశ రాజధాని వేదికైంది. ప్రతిష్టాత్మక వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోటీల్లో తెలంగాణ నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థినిగా నిలిచి చరిత్ర సృష్టించింది శ్రీనిత్య. లోక్‌సభ స్పీకర్, కేంద్ర మంత్రుల సమక్షంలో ఎలాంటి బెరుకు లేకుండా గళమెత్తి యావత్ తెలంగాణ గర్వపడేలా చేసిన ఆమె సక్సెస్ జర్నీ ఇప్పుడు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. పార్లమెంట్‌లో మెరిసిన కరీంనగర్ స్టూడెంట్.. మాటలతో అదరగొట్టిన  శ్రీనిత్య..
Karimnagar Student Srinithya Shines In Parliament
G Sampath Kumar
| Edited By: |

Updated on: Nov 07, 2026 | 4:44 PM

Share

గల్లీ స్థాయి నుంచి మొదలైన ఆమె ప్రయాణం దేశ అత్యున్నత ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్ సెంట్రల్ హాల్ వరకు సాగింది. తన అసాధారణ వాక్చాతుర్యం, అచంచలమైన ఆత్మవిశ్వాసంతో జాతీయ స్థాయిలో తెలంగాణ కీర్తి పతాకను రెపరెపలాడించింది కరీంనగర్ విద్యార్థిని ఎం. శ్రీనిత్య. ఢిల్లీలోని లోక్‌సభ సెంట్రల్ హాల్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మక వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్–2026 కార్యక్రమంలో అద్భుతంగా ప్రసంగించి, ప్రముఖులందరి మన్ననలు పొందింది. కరీంనగర్‌లోని ఎస్సాఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న శ్రీనిత్య.. కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన యూత్ పార్లమెంట్ పోటీల్లో అంచెలంచెలుగా రాణించింది. రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, దేశవ్యాప్తంగా వందలాది మంది పోటీపడిన ఈ వేదికపై తెలంగాణ నుంచి జాతీయ స్థాయికి ఎంపికైన ఏకైక విద్యార్థినిగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది.

పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో అద్భుత వాక్చాతుర్యం

భారత తొలి ఉపప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 31న పార్లమెంట్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. లోక్‌సభ స్పీకర్, కేంద్ర మంత్రులు, విపక్ష నాయకులు, ఉన్నతాధికారులు ఆసీనులైన ఆ సభలో శ్రీనిత్య ఏమాత్రం బెరుకు లేకుండా ధైర్యంగా గళమెత్తింది. ‘‘దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువత పాత్ర – వికసిత భారత్ దిశగా సరికొత్త ఆలోచనలు’’ అనే అంశంపై స్పష్టమైన విశ్లేషణ, పదునైన పదాలతో సాగిన ఆమె ప్రసంగం యావత్ సభను కట్టిపడేసింది.

యువతకు స్ఫూర్తిప్రదాతగా శ్రీనిత్య.. ప్రశంసల వెల్లువ

సాధారణ ప్రభుత్వ కళాశాల నుంచి పార్లమెంట్ వేదిక వరకు ఎదిగిన శ్రీనిత్య విజయం కరీంనగర్ జిల్లాకే కాకుండా యావత్ తెలంగాణ విద్యార్థి లోకానికి గర్వకారణంగా నిలిచింది. పట్టుదల, నిరంతర సాధన ఉంటే సరిహద్దులు దాటి జాతీయ స్థాయిలో రాణించవచ్చని ఆమె నిరూపించింది. ఈ అరుదైన మైలురాయిని అధిగమించిన శ్రీనిత్యను కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఎస్సాఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ, అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ విద్యాసంస్థల ప్రతిష్టను దేశ రాజధానిలో ఇనుమడింపజేసిన శ్రీనిత్య భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.

Follow Us
గల్లీ నుంచి ఢిల్లీ దాకా..పార్లమెంట్‌లో మెరిసిన కరీంనగర్ స్టూడెంట్
గల్లీ నుంచి ఢిల్లీ దాకా..పార్లమెంట్‌లో మెరిసిన కరీంనగర్ స్టూడెంట్
ట్యాంక్‌లెస్ గీజర్..నీటిని స్టోర్ చేయకుండానే వేడి చేస్తుంది..ఎలా?
ట్యాంక్‌లెస్ గీజర్..నీటిని స్టోర్ చేయకుండానే వేడి చేస్తుంది..ఎలా?
మరమరాలతో దీపావళి స్వీట్.. నోట్లో వెన్నలా కరిగిపోయే అమృతం
మరమరాలతో దీపావళి స్వీట్.. నోట్లో వెన్నలా కరిగిపోయే అమృతం
విధి ఆడిన వింతనాటకం.. చనిపోదామని నదిలోకి దూకితే.. మొసలి దాడితో..
విధి ఆడిన వింతనాటకం.. చనిపోదామని నదిలోకి దూకితే.. మొసలి దాడితో..
జలుబు, దగ్గుకు దివ్యౌషధం..  ఘాటైన చికెన్ రసం.. 
జలుబు, దగ్గుకు దివ్యౌషధం..  ఘాటైన చికెన్ రసం.. 
ఆ జ్యూస్ తాగడం వల్లే నాగార్జున జుట్టు ఊడదు..
ఆ జ్యూస్ తాగడం వల్లే నాగార్జున జుట్టు ఊడదు..
ఒక్క పరుగుతో పాంటింగ్ రికార్డు బద్దలు.. కోహ్లీ ఖాతాలో మరో చరిత్ర
ఒక్క పరుగుతో పాంటింగ్ రికార్డు బద్దలు.. కోహ్లీ ఖాతాలో మరో చరిత్ర
దీపావళి వేళ రెండు రాజయోగాలు.. 4 రాశులకు పట్టిందల్లా బంగారమే!
దీపావళి వేళ రెండు రాజయోగాలు.. 4 రాశులకు పట్టిందల్లా బంగారమే!
జొన్నపిండితో కరకరలాడే చెక్కలు.. ఇలా చేస్తే టేస్ట్ సూపర్..
జొన్నపిండితో కరకరలాడే చెక్కలు.. ఇలా చేస్తే టేస్ట్ సూపర్..
దిల్ మూవీతో వచ్చింది.. ఆ సినిమాతో పోయింది..
దిల్ మూవీతో వచ్చింది.. ఆ సినిమాతో పోయింది..