పండగకు ముందే మేకను కోసి మటన్ విందు చేసుకున్నారు.. కట్‌చేస్తే.. ఒకరి తర్వాత ఒకరు..

కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. పిట్లం మండలం అన్నారం తండాలో విందు వికటించి దాదాపు 13 మంది అస్వస్థతకు గురయ్యారు. మటన్ తిన్న వెంటనే వాంతులు చేసుకోవడంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం వారికి ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

పండగకు ముందే మేకను కోసి మటన్ విందు చేసుకున్నారు.. కట్‌చేస్తే.. ఒకరి తర్వాత ఒకరు..
Mutton Feast Turns Tragic In Annaram Thanda

Updated on: Oct 19, 2026 | 8:29 PM

మటన్ తిని 13 మంది అస్వస్థతకు గురైన విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పిట్లం మండలం అన్నారం తండాకు చెందిన ఓ కుటుంబం దసరా పండుగకు ముందే కుటుంబ సభ్యులతో కలిసి విందు చేసుకుంది. ఈ విందులో భాగంగా కుటుంబ సభ్యులు ఓ భారీ మేకపోతును కోసి మటన్ కూరను వండారు. తర్వాత అందరూ కలిసి సంతోషంగా భోజనం చేశారు.

అయితే భోజనం చేసిన కాసేపటికే మటన్ తిన్న వారు ఒక్కొక్కరిగా వాంతులు చేసుకోవడం మొదలుపెట్టారు. మరికొందరికి వాంతులు, విరేచనాలు కూడా మొదలయ్యాయి. ఇలా నలుగురు చిన్నారులతో సహా మొత్తం 13 మంది కుటుంబ సభ్యులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వీరిని వెంటనే బాన్సువాడలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అక్కడ వారిని పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక ఆర్డీవో రవీందర్ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి అస్వస్థతకు గురైనవారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us