సమయం లేదు మిత్రమా అంటున్నాయి పార్టీలు. పండుగ పూట ఖాళీ లేకుండా మునుగోడును చుట్టుముట్టేశాయి. జనం పండుగ సందడిలో ఉంటే నేతలు మాత్రం ఓట్ల వేటలో బిజీబిజీగా గడిపారు. ఇప్పటికే ప్రతి గ్రామంలో మకాం వేసిన నేతలంతా ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారు. పండుగ పూట ప్రచారాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగించారు నేతలు. అయితే మంగళవారం గ్రహణం సందర్భంగా సెంటిమెంట్ ఫాలో అయి నాయకులెవ్వరూ మునుగోడు నియోజకవర్గంలో కనిపించలేదు. కాగా ప్రజా శాంతి పార్టీ ప్రెసిడెంట్ కేఏ పాల్ మునుగోడు బరిలో ఉన్న విషయం విధితమే. తన పార్టీ తరఫున వేసిన నామినేషన్ చెల్లదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. దీంతో ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచిన పాల్.. నియోజకవర్గంలో తన మార్క్ చూపిస్తున్నారు. ప్రచారం విషయంలో తాను మోనార్క్ అని తన యాక్షన్‌తో చూపిస్తున్నారు.
మునుగోడు ఓటర్లలో ఫుల్ జోష్ నింపుతున్నారు కేఏ పాల్. తన వెరైటీ ప్రచారంతో ఆకట్టుకుంటున్నారు. ఆయన ఎక్కడుంటే అక్కడ సందడే సందడి. తాజాగా నారాయణపూర్ మండలంలో స్టెప్పులు వేశారు. ఆయన డ్యాన్స్‌కు జనం ఈలలు, కేరింతలతో ఫుల్ సపోర్ట్ చేశారు. ఆయన మాంచి జోష్‌తో డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కేఏ పాలా మజాకా..? అని కామెంట్స్ పెడుతున్నారు ఆ వీడియో చూసిన నెటిజన్స్.
ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా గద్దర్ పోటీ చేస్తున్నట్లు తొలుత ప్రకటించారు కేఏ పాల్. కానీ ఆయన చివరి నిమిషంలో మనసు మార్చుకోవడంతో.. డైరెక్ట్ పాలే రంగంలోకి దిగారు. అప్పట్నుంచి అటు జనాలను ఎంటర్టైన్ చేయడంలోనూ, ఇటు మీడియా దృష్టి పడటంలోనూ స్పెషల్ కేర్ తీసకుంటున్నారు. మొన్నీమధ్య.. 6నెలల్లో మునుగోడును అమెరికాను చేస్తామన్నారు. ఆపై ఓ అధికారితో గొడవ పడి.. తెలంగాణ నెక్ట్స్ సీఎం తానే అని కలరింగ్ ఇచ్చారు. ఇలా పాల్ ఏం చేసినా నవ్వులే.. నవ్వులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..