భూమిలో విత్తనాలను వేసినప్పటి నుంచి పంట చేతికొచ్చేదాకా రైతులకు ప్రతిరోజు పోరాటమే. చేతికొచ్చిన పంటలను రక్షించుకునేందుకు అన్నదాతలు నానా కష్టాలు పడుతుంటారు. పంటను కాపాడుకునేందుకు వినూత్నంగా ఆలోచిస్తూ పంట చేనుల్లో బొమ్మలను, వివిధ పరికరాలను ఏర్పాటు చేసుకుంటూ, పక్షులు, జంతువులు అటువైపు రాకుండా జాగ్రత్త పడుతుంటారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాకు చెందిన ఓ పశువుల కాపరి వినూత్న ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాడు. మేక పోతు “తోలు బొమ్మ”తో కోతుల నుంచి పంటలకు రక్షించుకుంటున్నాడు.
కోటి విద్యలు కూటి కోసం….అంటుంటారు. కానీ ఒక వ్యక్తి కోతుల కోసం కోటి ఉపాయాలు అంటున్నాడు. అదేనండి కోతుల బెడద నుంచి పండిన పంటను కాపాడేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం అమ్మపాలెం గ్రామం లో ఒక కాపలాదారుడు ఉపాయానికి స్థానికులు ఫిదా అయిపోయారు. తాము శ్రమించి పండించిన మొక్క జొన్న పంటను కోతులు గుంపు నాశనం చేస్తున్నాయని ఆ రైతు కొవ్వూరి రామకృష్ణ అనే అతడిని మొక్క తోటకు కాపరిగా పెట్టాడు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా కోతుల నుంచి మొక్క పంటను కాపాడలేక పోయినా రామకృష్ణ కు ఒక అద్భుతమైన ఉపాయం వచ్చింది. వారం.. వారం.. మటన్ షాపు వెళ్ళే రామకృష్ణ తనకు వచ్చిన ఆలోచనకు అనుగుణంగా మటన్ షాపు యజమానితో మాట్లాడి ఒక మేకపోతు చర్మాన్ని కొనుగోలు చేసి తెచ్చుకున్నాడు. ఆ మేక పోతు చర్మాన్ని అచ్చం బ్రతికి ఉన్న జీవి లాగానే కాళ్ళు, తల భాగాలను సూది దారంతో కుట్టాడు. చర్మం లోపల వరి గడ్డి ఉంచి బతికున్న మేకపోతులా కర్రల సహాయం తో తయారు చేశాడు.
ఆ తోలు బొమ్మ పోకపోతును ఒక తాడుతో కట్టి మొక్క పొలం వద్ద కాపలా కాస్తున్నాడు. రోడ్డుపై తాడుతో బొమ్మను లాగుతూ.. హడావిడి చేస్తుంటాడు. దీంతో కోతులు ఎదో వింత జంతువుగా భావించి తోట వైపు రావడమే మానేశాయని చెపుకొస్తున్నాడు కాపలాదారు రామకృష్ణ. తానే స్వయంగా మేక పోతు తోలుతో బొమ్మను తయారు చేశానని, ఈ బొమ్మను చూసి కోతులు రాకుండా వెళ్ళిపోతున్నాయన్నారు. అందుకు తోట యజమాని తనను అభినందించినట్లు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. భలే ఉంది కదా ఐడియా..!
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..