Indiramma Kutumba Bima: ఇందిరమ్మ బీమా పొందాలంటే కచ్చితంగా ఇంటి పన్ను చెల్లించాలా?

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం 'ఇందిరమ్మ కుటుంబ బీమా'. ఈ పథకం కింద అర్హులైన కుటుంబంలోని ఒకరికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నారు. ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, ఇంటి పన్ను చెల్లిస్తేనే ఈ పథకానికి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలని, చెల్లించని వారి పేర్లను నమోదు చేయట్లేదనే చర్చ జరుగుతోంది. మరి ఇందులో వాస్తవమెంతో తెలుసుకుందాం.

Indiramma Kutumba Bima: ఇందిరమ్మ బీమా పొందాలంటే కచ్చితంగా ఇంటి పన్ను చెల్లించాలా?
Indiramma Kutumba Bima Scheme

Updated on: Nov 27, 2026 | 7:39 AM

పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం ‘ఇందిరమ్మ కుటుంబ బీమా’. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అధికారికంగా అమల్లోకి తీసుకువచ్చింది. అలాగే అర్హులైన వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. గ్రామాల్లో అధికారులు సైతం ఆఫ్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు. అయితే పాలకుర్తి మండలంలో ఈ పథకానికి సంబంధించిన ఆన్‌లైన్ వివరాల నమోదు చర్చనీయాంశంగా మారింది.

పాలకుర్తి మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలు ఈ పథకం నమోదులో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రజలు ఇందిరమ్మ బీమా పథకం నమోదు కోసం అవసరమైన పత్రాలు తీసుకొని గ్రామ పంచాయతీలకు వెళ్లగా, కేవలం ఇంటి పన్ను చెల్లించిన వారి వివరాలు మాత్రమే అధికారులు నమోదు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇంటి పన్ను కట్టని వారి వివరాలు నమోదు చేయడం లేదని ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఓ గ్రామంలో పంచాయతీ అధికారులు రూ. లక్ష వరకు లబ్ధిదారుల నుంచి ఇంటి పన్ను వసూలు చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే దృష్టికి కూడా వెళ్లిందని ప్రజలు చెబుతున్నారు.

అయితే ఈ విషయంపై పాలకుర్తి ఎంపీడీవో రమేశ్‌ను వివరణ కోరగా, ఇందిరమ్మ బీమా పథకం కోసం వివరాలు ఆన్‌లైన్‌లో ఎంటర్ చేయడానికి ఇంటి పన్నుకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈ విషయం తమ దృష్టికి కూడా వచ్చిందని, దీనిపై గ్రామ పంచాయతీ అధికారులతోనూ మాట్లాడుతామని స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us