Telangana: 70 ఎకరాల అడవిని సృష్టించిన ప్రకృతి ప్రేమికుడి డాక్యుమెంటరీ ఢిల్లీలో ప్రదర్శన

| Edited By: Aravind B

Sep 19, 2023 | 10:10 PM

కాసులకు కక్కుర్తి పడుతూ పర్యావరణానికి తూట్లు పొడుస్తున్న నేటి ఆధునిక కాలంలో జీవవైవిధ్యానికి జీవం పోస్తున్న మహోన్నత వ్యక్తి అతను. తనకు వారసత్వంగా వచ్చిన 70 ఎకరాల వ్యవసాయ భూమిని అడవిగా మార్చి అందరికీ ఆదర్శంగా నిలిచిన ప్రకృతి ప్రేమికుడు. ప్రకృతి మానవుడికి ప్రసాదించిన అడవులను కాపాడుతున్న పర్యావరణవేత్త, ప్రకృతి ప్రేమికుడు. ఇండియాస్ గ్రీన్ హార్ట్ దుశ్చర్ల సత్యనారాయణ" డాక్యుమెంటరీని ఢిల్లీలో ప్రదర్శించనున్నారు.

Telangana: 70 ఎకరాల అడవిని సృష్టించిన ప్రకృతి ప్రేమికుడి డాక్యుమెంటరీ ఢిల్లీలో ప్రదర్శన
Dusharla Satyanarayana
Follow us on

కాసులకు కక్కుర్తి పడుతూ పర్యావరణానికి తూట్లు పొడుస్తున్న నేటి ఆధునిక కాలంలో జీవవైవిధ్యానికి జీవం పోస్తున్న మహోన్నత వ్యక్తి అతను. తనకు వారసత్వంగా వచ్చిన 70 ఎకరాల వ్యవసాయ భూమిని అడవిగా మార్చి అందరికీ ఆదర్శంగా నిలిచిన ప్రకృతి ప్రేమికుడు. ప్రకృతి మానవుడికి ప్రసాదించిన అడవులను కాపాడుతున్న పర్యావరణవేత్త, ప్రకృతి ప్రేమికుడు. ఇండియాస్ గ్రీన్ హార్ట్ దుశ్చర్ల సత్యనారాయణ” డాక్యుమెంటరీని ఢిల్లీలో ప్రదర్శించనున్నారు. ఇంతటి విశిష్ట వ్యక్తి ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవపురానికి చెందిన దుశ్చర్ల సత్యనారాయణకు ఎనిమిదేళ్ల వయస్సు నుంచే ప్రకృతి అంటే ఆసక్తి. బ్యాంక్‎లో వివిధ హోదాల్లో పనిచేసిన దుశ్చర్ల సత్యనారాయణ.. ప్రకృతిపై ఉన్న ప్రేమతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు.

నల్లగొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యపై జల సాధన పేరుతో ఉద్యమించిన దుశ్చర్ల సత్యనారాయణ.. వారసత్వంగా తనకు వచ్చిన 70 ఎకరాల భూమిని ఆరు దశాబ్దాలు శ్రమించి అడవిని సృష్టించాడు. మూగ జీవాలకు ఆవాసంగా.. జీవరాశులకు ఆహారం, నీళ్లు అందించేలా అడవిని రూపొందించాడు ఈ ప్రకృతి ప్రేమికుడు. ఐదెకరాల్లో పక్షులు, జంతువులకు ఉపయోగపడే పంటలను సాగుచేశారు. భూగర్భ జలాల పెంపు, జంతువులు, పక్షుల తాగునీటికి 7 ప్రాంతాల్లో కుంటలు తవ్వించారు. కొన్ని చోట్ల బోర్లు వేయించారు. అడవిలో మాదిరిగా ఉండే పలు రకాల పక్షులు, జంతువులకు ఆవాసంగా ఈ అడవిని మార్చి జీవ వైవిధ్యానికి జీవం పోస్తూ పర్యావరణ వేత్తగా అందరికీ ఆదర్శంగా నిలిచాడు.

కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో..
ఈ నెల 22-24 తేదీల మధ్య ఢిల్లీలో ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్‌‎లో నాలుగో నది ఉత్సవం జరగనుంది. నదుల సంస్కృతి – మానవ జీవనం, అనుబంధం, సుస్థిర అభివృద్ధి భావనను పునర్నిర్వచించడం ఈ నది ఉత్సవం లక్ష్యం. ఈ ఉత్సవంలో పర్యావరణవేత్త దుశర్ల సత్యనారాయణపై “ఇండియాస్ గ్రీన్‌హార్ట్ దుశర్ల సత్యనారాయణ” అనే డాక్యుమెంటరీ ప్రదర్శనకు ఎంపికైంది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న దర్శక, నిర్మాత చిలుకూరి సుశీల్‌రావు నిర్మించిన ఇండియాస్ గ్రేట్ హార్ట్‌ దుసర్ల సత్యనారాయణ డాక్యుమెంటరీ సినిమా.. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోని జన్‌పథ్ బిల్డింగ్, న్యూఢిల్లీ ఇందిరాగాంధీ జాతీయ కళల కేంద్రంలో ప్రదర్శించనున్నారు. మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా సినీ నిర్మాతలు రూపొందించిన 15 డాక్యుమెంటరీలను ప్రదర్శించనున్నారు. నది ఉత్సవ్‌లో భాగంగా నదులు, నదీ జీవితాల మధ్య సామరస్యాన్ని పునరుద్ధరించడం. జల సంస్థలు, నదుల సంస్కృతి, సుస్థిర అభివృద్ధి భావనపై జాతీయ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పండితులు, విద్యావేత్తలు, పరిశోధకులు, సంబంధిత వాటాదారులు పాల్గొననున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..