వాటర్ ఎమర్జెన్సీ..! జనవరి తర్వాత దాహం దాహం.. జలమండలి దగ్గర ఉందా పరిష్కారం..?

ఒకప్పుడు నిండుగా కళకళలాడిన నగరం.. ఇప్పుడు ఎండుతున్న నగరం. ఔను, భూకంపాలనైనా తట్టుకుని నిలబడగల భాగ్యనగరం ఇప్పుడు రాబోయే జల సంక్షోభాన్ని తలచుకుని ఒకలాంటి డిప్రెషన్‌లోకే వెళ్లిపోతోంది. భూగర్భజలాలు నిండుకుని నిలువునా ఎండిపోతోంది. రోడ్డుకు రెండువైపులా చెట్లు నాటించాడని రాయలవారి పేరును ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నాం. కానీ ఆయన నాటించిన చెట్లను తడపడానికే నీళ్లు లేని దురవస్థలో ఉన్నాం. జంటనగరాల్లో జనవరి తర్వాత విరుచుకుపడబోయే జలకరువు గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

వాటర్ ఎమర్జెన్సీ..! జనవరి తర్వాత దాహం దాహం.. జలమండలి దగ్గర ఉందా పరిష్కారం..?
Hyderabad Water Crisis

Updated on: Oct 30, 2026 | 9:41 PM

పాతికేళ్ల కిందట గుజరాత్‌ మొత్తం ఎండినప్పుడు, నీళ్లు, కరెంట్ లేక కరువుతో అహ్మదాబాద్ అల్లాడిపోయినప్పుడూ ఇదే చెప్పా, ఇప్పుడూ అదే చెబుతున్నా. భాయియో ఔర్ బహెనోం సేవ్ వాటర్… సేవ్ బిజిలీ. దేశమంతా వినబడేటట్టు డప్పుకొట్టి చెప్పారు ప్రధాని మోదీ. నీళ్లను పొదుపుగా వాడుకోండి, బంగారంలా దాచుకోండి అనేమాట ఇప్పుడు భాగ్యనగరంలో అంతకంటే గట్టిగానే రీసౌండ్ ఇస్తోంది. ప్రతీ నీటి బొట్టును లెక్కబెట్టి ఖర్చుపెట్టుకోండి.. వృధా చేస్తే నల్లా కనెక్షన్, బోర్‌వెల్ కనెక్షన్ కట్టవుతుంది.. అనే వార్నింగులు చెవిన పడుతున్నా జనం మాత్రం పెడచెవిన పెడుతున్నారు. అందుకే.. రండి, వాలంటీర్లుగా చేరండి.. వాటర్ వేస్టేజ్‌పై విజిల్‌బ్లోయర్లుగా మారండి.. నీళ్ల కరువునుంచి మిమ్మల్ని మీరే కాపాడుకోండి అని కొత్తకొత్త పథకాలు కూడా మొదలెట్టింది ప్రభుత్వం. హైదరాబాద్‌ని ముంచెత్తబోతోంది నీటి కరువు. కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి ఏరియాల్లో భూగర్భజలం 100 మీటర్ల కిందకు పడిపోయి బోరుబావులు పూర్తిగా ఎండిపోయాయి. ఉస్మాన్ సాగర్, సింగూర్, హిమాయత్ సాగర్, మంజీరా నదుల్లో నీటిమట్టాలు డెడ్‌స్టోరేజ్‌కి దగ్గరయ్యాయి. ఇక నగరజీవికి మిగిలున్న ఏకైక ప్రత్యామ్నాయం ట్యాంకర్ల బుకింగేగా? అది కూడా వెయిటింగ్ లిస్టుతో వెక్కిరిస్తోంది. రోజుకు గరిష్టంగా 8 వేల ట్యాంకర్లు బుక్ ఔతున్నాయంటే నగరంలో నీళ్ల డిమాండ్ ఏ...

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి