చిన్నారి సహా భార్యభర్తలు మృతి.. దహన సంస్కారాలను వీడియో కాల్‌లో వీక్షించిన తల్లిదండ్రులు!

కన్న కూతురిని చంపి, ఆ తర్వాత భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో వెలుగుచూసింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బాధిత బంధువులకు అప్పగించగా.. లోయర్ ట్యాంక్‌బండ్ సమీపంలోని శ్మశానవాటికలో వారికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలను వీడియో కాల్ ద్వారా చూసిన బెంగాల్‌లోని దంపతుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

చిన్నారి సహా భార్యభర్తలు మృతి.. దహన సంస్కారాలను వీడియో కాల్‌లో వీక్షించిన తల్లిదండ్రులు!
Hyderabad Family Suicide

Updated on: Oct 29, 2026 | 11:42 AM

కన్న కూతురిని చంపి తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడగా.. వారి అంత్యక్రియలను బెంగాల్‌లోని బాధిత కుటుంబ సభ్యులు వీడియో కాల్ ద్వారా వీక్షించిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కేపీహెచ్‌బీ మూడో ఫేజ్‌లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన గోపీనాథ్, సమత దంపతులు తమ 23 నెలల కుమార్తె స్నిగ్ధతో కలిసి నివాసం ఉంటున్నారు. ఏమైందో తెలియదు కానీ, బుధవారం ఈ దంపతులతో పాటు చిన్నారి కూడా ఫ్లాట్‌లో విగతజీవులుగా కనిపించారు. గమనించిన అపార్ట్‌మెంట్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.

అక్కడ గోపీనాథ్ రాసిన సూసైడ్ నోట్ లభించడంతో వారు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. “స్నిగ్ధ, సమత వెళ్లిపోయారు.. నేను కూడా వెళ్లిపోతున్నా” అని లేఖలో గోపీనాథ్ రాసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి గోపీనాథ్ సోదరులకు అప్పగించారు. దీంతో వారు లోయర్ ట్యాంక్‌బండ్ సమీపంలోని శ్మశానవాటికలో గోపీనాథ్ దంపతులతో పాటు చిన్నారికి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ అంత్యక్రియలను బెంగాల్‌లో ఉన్న దంపతుల తల్లిదండ్రులు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా చూసి బోరున విలపించారు.

ఈ దంపతుల గురించి పోలీసులు అపార్ట్‌మెంట్ వాసులను విచారించగా వెల్లడైన విషయాలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, పాపను కూడా ప్రాణంగా చూసుకునేవారని స్థానికులు తెలిపారు. చిన్నారిని తాను రోజూ పార్కుకు తీసుకెళ్లేవాడినంటూ ఎదురింట్లో ఉండే వృద్ధుడు కన్నీటిపర్యంతమయ్యాడు. వారికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లు ఎప్పుడూ అనిపించలేదని, వారి ఆత్మహత్యకు మరేదైనా కారణం ఉండొచ్చని స్థానికులు అభిప్రాయపడ్డారు. దీంతో పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us