TV9 Telugu: డిజిటల్ విభాగంలో దుమ్మురేపుతున్న టీవీ9.. యూట్యూబ్‌ వ్యూస్ పరంగా సెన్సేషన్

|

Dec 06, 2021 | 8:15 PM

అదే జోరు.. అదే తీరు.. అదే నిబద్ధత.. వెరసి టీవీ9 తెలుగు. టీవీ9... తెలుగు ప్రజల ఫేవరెట్ న్యూస్ ఛానల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

TV9 Telugu: డిజిటల్ విభాగంలో దుమ్మురేపుతున్న టీవీ9.. యూట్యూబ్‌ వ్యూస్ పరంగా సెన్సేషన్
Tv9 Telugu Youtube
Follow us on

అదే జోరు.. అదే తీరు.. అదే నిబద్ధత.. వెరసి టీవీ9 తెలుగు. టీవీ9… తెలుగు ప్రజల ఫేవరెట్ న్యూస్ ఛానల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎల్లవేళలా టీవీ9పై తెలుగు ప్రజల చూపిస్తోన్న అభిమానానికి, ఆదరణకు ముందుగా మీకు ధన్యవాదాలు. న్యూస్ ఛానల్ పరంగా నిర్విరామంగా టాప్ ప్లేసులో కొనసాగుతున్న టీవీ9 తెలుగు.. తాజాగా డిజిటల్ మీడియాలో తనకు తిరుగులేదని నిరూపించుకుంది. టీవీ9 తెలుగు యూట్యూబ్ ఛానల్ తెలుగు మీడియాలో వ్యూస్ పరంగా టాప్ ప్లేసులో నిలిచింది. నవంబర్ నెలలో టీవీ9 తెలుగు యూట్యూబ్ ఛానల్‌కు ఏకంగా 204.37 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అక్టోబర్ నెలలో ఈ సంఖ్య 183 మిలియన్లుగా ఉంది.  మెరుగైన సమాజం కోసం నిత్యం తపిస్తున్న టీవీ9 ఛానల్ వెంట తెలుగు ప్రజలంతా ఉన్నారని చెప్పడానికి ఇది మరో ఉదాహారణ. జెట్ స్పీడులో వార్తలను ప్రజలకు చేరువ చేయడం.. అంతకుమించిన ఖచ్చితత్వం.. సొసైటీలోని సమస్యలను ఎటువంటి బెరుకు లేకండా ప్రజెంట్ చేయడం వంటివి టీవీ9 తెలుగును అగ్రస్థానంలో నిలబెట్టాయి. ఈ మధ్య కాలంలో డిజిటల్ ప్రాధాన్యం ఏమేర పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కువమంది ఫోన్లలోనే వార్తలు చదువుతున్నారు.. చూస్తున్నారు. ఈ క్రమంలో డిజిటల్ వ్యూయర్స్ కోసం త్వరితగతిత వార్తలు చేరవేస్తోంది టీవీ9.

కాగా టీవీ9 తెలుగు యూట్యూబ్ ఛానల్ నంబర్ 1గా నిలవడంతో.. నేడు సంస్థ కార్యాలయంలో వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న సంస్థ మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్.. టీవీ9 తెలుగు యూట్యూబ్ ఛానల్‌ను నంబర్ 1గా నిలపడంలో భాగమైన ప్రతి కుటుంబ సభ్యుడ్ని, సభ్యరాలిని అభినందించారు. డిజిటల్ విభాగాన్ని టీమ్ స్పిరిట్‌తో ముందుకు నడుపుతోన్న డిజిటల్ హెడ్  షీతల్ మోర్జారియాను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో మున్ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాక్షించారు. మెరుగైన సమాజం అనే స్లోగన్.. మైండ్‌లో, మనసులో పెట్టుకుని… అలానే ముందుకు వెళ్లాలని సిబ్బందికి సూచించారు. జర్నలిజం విలువలకు కట్టుబడుతూ డిజిటల్ విభాగంలోనూ టీవీ9 తెలుగు దూసుకుపోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.