ఈ వీడియో చూశాక భార్యల జోలికి పోవాలంటే భర్తలకు పెద్ద సాహసమే.. భయంతో వణికిపోతారు!

వినడానికి వింతగా ఉన్నా ఇది వాస్తవం. హైదరాబాద్ నగరం పాతబస్తీలో జరిగిన రెండు ఘటనలు జనాల్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇది చూశాక భార్యల జోలికి పోవాలంటే భర్తలు సైతం వణికిపోతారు. అవునా.. అంతలా అసలేం జరిగింది అనే కదా మీ ప్రశ్న. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం రండి.

ఈ వీడియో చూశాక భార్యల జోలికి పోవాలంటే భర్తలకు పెద్ద సాహసమే.. భయంతో వణికిపోతారు!
Hyderabad Police
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 27, 2024 | 2:21 PM

వినడానికి వింతగా ఉన్నా ఇది వాస్తవం. హైదరాబాద్ నగరం పాతబస్తీలో జరిగిన రెండు ఘటనలు జనాల్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇది చూశాక భార్యల జోలికి పోవాలంటే భర్తలు సైతం వణికిపోతారు. అవునా.. అంతలా అసలేం జరిగింది అనే కదా మీ ప్రశ్న. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం రండి.

పాతబస్తీలో కాపురముంటున్న ఓ భార్యాభర్తల మధ్య అందరి సంసారంలో లాగే చిన్న చిన్న గొడవలు వచ్చాయి. ఎప్పటిలాగే సర్దుకుపోవడం మానేసి ఈ భార్య కొంచెం బెట్టు చేసింది. భర్త మీద అలిగిన ఆ మహిళ చెప్పాపెట్టకుండా తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది. ఇలా కొన్ని రోజులు ఆ భార్యాభర్తలు మాట్లాడుకోవడం మానేశారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉండగా.. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆ మహిళ భర్తకు ఫోన్ చేసింది. తమకు కొడుకు పుట్టాడు, వచ్చి చూసి వెళ్లమని ప్రేమతో మాయమాటలు చెప్పింది. ఇది నమ్మిన ఆ భర్త సంతోషంగా భార్య బిడ్డల్ని చూడాలని అత్తవారింటికి వెళ్లాడు. ఇంకేముంది.. ఇంట్లోకి వచ్చిన భర్తను బలవంతంగా ఒక రూములో బంధించి కుక్కను బాదినట్లు బాదింది. తన భార్య తనకు చెప్పిందంతా అబద్దం అని తెలుసుకున్న ఆ భర్తకు అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. భార్య కొట్టిన దెబ్బలు తట్టుకోలేక ఒక రూములో దాక్కుని ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆ వీడియోలో తాను ఎక్కడ ఉన్నది, ఏం జరిగింది అనే విషయాలతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అతను ఇచ్చిన వివరాల ఆధారంగా లొకేషన్ కనుకున్న పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి ఆ యువకుడిని అక్కడి నుంచి కాపాడారు. తన దగ్గరి మరిన్ని పూర్తి వివరాలు సేకరించారు. ఆ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తన భార్య నుంచి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా.. ఇలాంటి సంఘటనే మరొకటి పాతబస్తీలోని మాదన్నపేటలో కూడా చోటు చేసుకుంది. కొంచెం అటు ఇటుగా అలాగే ఉన్న మరో భర్త వ్యధ ఇది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో అలిగిన భార్య తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లిపోయింది. కొంతకాలం ఇద్దరి మధ్య సంప్రదింపులు లేవు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ మహిళ కుటుంబ సభ్యులు కొంతమంది రౌడీలను ఆ భర్త ఇంటికి పంపించి అతనిపై దాడి చేయించారు. తీవ్రంగా తనను గాయపరిచి, తనపై ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన అత్తింటివారిపై ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ రెండు సంఘటనలు భార్యలు చేసిన అరాచకంతో భర్తలు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితులు. కుటుంబంలో వచ్చిన కలహాలను తమకు అనుకూలంగా మార్చుకుని రివర్స్ లో తమపైనే భర్తలు దాడులు చేస్తున్నారని చెప్పే మహిళలు కూడా లేకపోలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు కొందరు భార్యామణులు. ఇలా చాలా చోట్ల భార్యలు పెట్టే వేధింపులు తాళలేక, పూర్తి ఆధారాలు చూపిస్తూ తమకు న్యాయం చేయాలంటూ పోలీసుల దగ్గర కంటితడి పెట్టుకుంటున్న అమాయకపు భర్తలు ఎందరో ఉన్నారు మన చుట్టూ.

Latest Articles
నార్త్ సినిమాల బిజినెస్‌ కోసం సౌత్‌ మీద దృష్టిపెడుతున్న మేకర్స్
నార్త్ సినిమాల బిజినెస్‌ కోసం సౌత్‌ మీద దృష్టిపెడుతున్న మేకర్స్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చెర్రీ లీక్స్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చెర్రీ లీక్స్
కేజీఎఫ్ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్న హీరో
కేజీఎఫ్ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్న హీరో
పుష్ప2 తరువాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి ??
పుష్ప2 తరువాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి ??
తెలంగాణ బీజేపీ కొత్త సారధిపై కమలం కసరత్తు.. రేసులో ఉన్నది వీరే..
తెలంగాణ బీజేపీ కొత్త సారధిపై కమలం కసరత్తు.. రేసులో ఉన్నది వీరే..
చైల్ట్ ఆర్టిస్ట్.. ఇప్పుడెంత బోల్డ్‌గా మారిపోయిందో తెలుసా?
చైల్ట్ ఆర్టిస్ట్.. ఇప్పుడెంత బోల్డ్‌గా మారిపోయిందో తెలుసా?
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. పూర్తి జాబితా..
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. పూర్తి జాబితా..
చిటికెడు మిరియాల పొడిని ఈ నూనెలో కలిపి రాస్తేచాలు తెల్లజుట్టుమాయం
చిటికెడు మిరియాల పొడిని ఈ నూనెలో కలిపి రాస్తేచాలు తెల్లజుట్టుమాయం
టాస్ గెలిచిన న్యూజిలాండ్.. విజయంతో వీడ్కోలు చెప్పేనా..
టాస్ గెలిచిన న్యూజిలాండ్.. విజయంతో వీడ్కోలు చెప్పేనా..
బైక్‌పై వస్తున్న వ్యక్తిని ఆపిన పోలీసులు.. అతని బ్యాగులో
బైక్‌పై వస్తున్న వ్యక్తిని ఆపిన పోలీసులు.. అతని బ్యాగులో