Weather Alert: రెయిన్ అలర్ట్.. రెండు రోజులపాటు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ వచ్చేసింది..

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. పగలు ఎండలు ఠారెత్తిస్తుండగా.. సాయంత్రం వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో అప్డేట్ ఇచ్చింది.. ఆదివారం, సోమవారం తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని అలర్ట్ జారీ చేసింది..

Weather Alert: రెయిన్ అలర్ట్.. రెండు రోజులపాటు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ వచ్చేసింది..
Rain Alert

Updated on: May 04, 2025 | 8:03 AM

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. పగలు ఎండలు ఠారెత్తిస్తుండగా.. సాయంత్రం వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో అప్డేట్ ఇచ్చింది.. ఆదివారం, సోమవారం తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని అలర్ట్ జారీ చేసింది..

ఈ రోజు తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాలలో అక్కడక్కడ గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలోని 14 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ..

ఈ రోజు తెలంగాణలోని మంచిర్యాల, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ..

తెలంగాణలో ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి.. ఆదివారం తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ రోజు ఈ 6 జిల్లాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ రోజు గరిష్టంగా నిజామాబాద్ లో 43.4, కనిష్టంగా భద్రాచలం లో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. నిన్న నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, మెదక్, రామగుండం, లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..

నిజామాబాద్.. 42.4, ఆదిలాబాద్.. 42.3, నల్లగొండ.. 41, మెదక్.. 40.6, రామగుండం.. 39.6, మహబూబ్ నగర్.. 39.5, ఖమ్మం.. 39.4, భద్రాచలం.. 38, హైదరాబాద్.. 38, హనుమకొండ.. 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us