Amit Shah: హైదరాబాద్‌కు చేరుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా.. అక్కడి నుంచి..

Amit Shah:  తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టకు..

Amit Shah: హైదరాబాద్‌కు చేరుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా.. అక్కడి నుంచి..
Amit Shah

Updated on: Sep 17, 2022 | 2:09 AM

Amit Shah:  తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టకు చేరుకున్న అమిత్‌ షాకు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో బస చేస్తారు.

ఈ విమోచన దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించేందుకు హైదరాబాద్‌ను ముస్తాబు చేశారు. అయితే కేంద్ర సర్కారే ఈ వేడుకలను నిర్వహిస్తోంది. సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ చరిత్ర ఉట్టి పడేలా ముస్తాబు చేశారు. . ఫోటో అండ్ ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. తెలంగాణ విమోచన ఉద్యమం ఎలా సాగింది..? ఆపరేషన్ పోలో ఎలా నిర్వహించారు. ఆనాటి నిజాం రజాకార్ల అకృత్యాలు ఎలా ఉండేవో.. కళ్లకు కట్టినట్టు చూపించే ఏర్పాట్లు జరిగాయి. పరేడ్ గ్రౌండ్ కార్యక్రమాలను కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us