Revanth Reddy: హైదరాబాద్‌లో మరో నగరం.. నాలుగు వేల ఎకరాల్లో నిర్మాణం, ఎక్కడో తెలుసా.?

ఇదిలా ఉంటే రాజధాని నగరంలో ప్రస్తుతం హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌ అని ఇలా మూడు నగరాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇందులో మరో నగరం యాడ్‌ కానుంది. నాలుగో నగరాన్ని నిర్మించనున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. బుధరవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా రేవంత్‌...

Revanth Reddy: హైదరాబాద్‌లో మరో నగరం.. నాలుగు వేల ఎకరాల్లో నిర్మాణం, ఎక్కడో తెలుసా.?
Representative Image

Updated on: Aug 01, 2024 | 7:00 AM

హైదరాబాద్‌.. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ చారిత్రాత్మక నగరం రోజురోజుకీ విస్తరిస్తోంది. విభిన్న సంస్కృతులు, సంప్రదాయలకు నెలవైన హైదరాబాద్‌ తన రూపాన్ని మార్చుకుంటూ పోతోంది. ఒకప్పుడు ముత్యాలకు ఫేమస్‌ అయిన భాగ్య నరగం ఆ తర్వాత కాలక్రమేణ ఐటీ, ఫార్మా రంగాలకు ప్రసిద్ధిగా మారింది. కోటి మందికిపైగా ప్రజలకు ఆశ్రయిస్తోంది మన హైదరాబాద్‌.

ఇదిలా ఉంటే రాజధాని నగరంలో ప్రస్తుతం హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌ అని ఇలా మూడు నగరాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇందులో మరో నగరం యాడ్‌ కానుంది. నాలుగో నగరాన్ని నిర్మించనున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. బుధరవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా రేవంత్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో నాలుగు వేల ఎకరాల్లో ఈ కొత్త నగరాన్ని నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ నాలుగో నగరానికి ఆరోగ్య, క్రీడా హబ్‌లు ఏర్పాటు చేస్తామన్న సీఎం, మెట్రోతో అనుసంధానం చేస్తామన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు వ్యవసాయం నుంచి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వరకు పలు రంగాలపై నూతన విధానాలు రూపొందిస్తాం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ఇక ముచ్చర్లలో ఏర్పాటు చేసే నగరంలో వైద్యసేవల నుంచి ఉపాధి వరకు లభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామని, క్రికెట్‌ స్టేడియం నుంచి గోల్ఫ్‌ కోర్స్‌ వరకు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముచ్చర్లలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మాణంపై ఇప్పటికే బీసీసీఐతో మాట్లాడినట్లు రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఒకప్పుడు హైదరాబాద్‌ నగరంలో ఆసియా క్రీడలు నిర్వహించేందుకు పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించారన్న సీఎం.. ఇప్పుడు అవి నిరుపయోగంగా మారాయన్నారు. మత్తు మందుకు బానిసగా మారుతోన్న యువత దృష్టిని క్రీడలపై మళ్లించేందుకు క్రీడా హబ్‌ ఏర్పాటు చేస్తామని సీఎం స్పష్టం చేశారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి.,

Loading...
Unable to load recommendations.
Follow Us