హైదరాబాద్ మెట్రో.. ప్రయాణీకుల కోసం సరికొత్త ఆఫర్ తీసుకువచ్చింది. సూపర్ సేవర్ కార్డు(Super Saver Card)ను ఎల్ అండ్ టీ ఎండీ కె.వి.బి.రెడ్డి ప్రారంభించారు. ఈ కార్డుతో సెలవుల్లో రూ.59తో రోజంతా మెట్రోలో తిరగొచ్చని ఆయన చెప్పారు. మెట్రో వర్గాలు ప్రకటించిన 100 రోజుల సెలవుల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని వివరించారు. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోజంతా తిరగొచ్చని స్పష్టం చేశారు. ఉగాది(Ugadi) నుంచి మెట్రోలో సూపర్ సేవర్ కార్డులు విక్రయించనున్నట్లు ఎండీ ప్రకటించారు. ప్రతి ఆదివారం, ప్రతి రెండు, నాలుగో శనివారంతో పాటు ఉగాది, రంజాన్, మొహర్రం, బోనాలు, ఆగష్టు 15, వినాయక చవితి, కృష్ణాష్టమి, దుర్గాష్టమి, దసరా, దీపావళి, బాక్సింగ్‌డే, బోగీ, సంక్రాంతి, శివరాత్రి వంటి పండుగ రోజుల్లో సూపర్ సేవర్ కార్డుతో ప్రయాణించవచ్చని ఆయన వివరించారు. కరోనా(Coronavirus) తర్వాత మళ్లీ మెట్రో సేవలు పుంజుకుంటున్నాయన్నారు. కరోనా టైమ్ లో ప్రయాణికుల భద్రతకు ప్రయారిటీ ఇచ్చినట్లు కె.వి.బి.రెడ్డి చెప్పారు. కరోనాకు ముందు రోజుకి 4 లక్షల కమ్యూటర్స్ ఉన్నారని.. ఇప్పుడు అందులో 70 శాతం అంటే 2.8 లక్షల మంది ప్రయాణీకులు సేవలు వినియోగించుకుంటున్నారని చెప్పారు. వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి రోజుకు 5 నుంచి 6 లక్షల ప్రయాణీకులే తమ టార్గెట్ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఐదుగురు మెట్రో పాసింజర్స్‌ను లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసి సువర్ణ ఆఫర్ విజేతలుగా ప్రకటించి.. బహుమతులు అందజేశారు.
Also Read: Viral: కన్నంలో ఉన్న పామును బయటకు లాగి కరకరా నమిలి తిన్న మరో పాము.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో