నైట్.. నైటీలో ఫేస్ కవర్ చేసి ఓ మహిళ ఆ ప్రాంతానికి వచ్చింది. సెల్ఫోన్ల షాపులోకి దూరి లక్షల విలువైన సెల్ఫోన్లను చోరీచేసింది. సికింద్రాబాద్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. ఫిర్యాదు అందుకున్న అధికారులు దర్యాప్తు షురూ చేశారు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ ఘటన జరిగిన తర్వాత ఆ షాపు సెక్యూరిటీ గార్డ్ సెలవు పెట్టి సొంతూరు వెళ్లాడు. ఇంకేముంది పోలీసులకు మేజర్ క్లూ దొరికింది. అతడిని అదుపులోకి తీసుకుని.. విచారించగా తానే దొంగనని ఒప్పుకున్నాడు.
మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎస్డీ రహదారిలో ఉన్న మొబైల్ దుకాణంలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న యాకయ్య.. అమ్మాయి వేషధారణలో వచ్చి అదే షాపులో సెల్ఫోన్లను కొట్టేశాడు. షాపు సీసీ కెమెరాలు పనిచేయకపోవడాన్ని అదునుగా మార్చుకుని పని కానిచ్చేశాడు. అయితే అతడు చేసిన తప్పు ఏంటంటే.. దొంగతనం అనంతరం.. తన సొంతూరు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ వెళ్లాడు. దీంతో పోలీసులకు అతడిపై అనుమానం కలిగింది. అదుపులోకి తీసుకుని విచారించగా.. తాను ఆ ఫోన్లను చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడి వద్ద నుంచి రూ.8 లక్షల విలువైన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం