Viral News: పాపం ఎన్ని చూసి ఉంటే ఇలా చేస్తాడు.. క్యాబ్ డ్రైవర్ గమ్మతైన కండిషన్..

|

Oct 21, 2024 | 12:57 PM

ఓ క్యాబ్ డ్రైవర్ తన క్యాబ్‌లో విన్నూత్నంగా ఓ పోస్టర్‌ను పెట్టాడు. ముఖ్యంగా అది యువ ప్రేమ జంటలను ఉద్దేశించి పెట్టినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. ఇంతకీ అందులో ఏముంది? అంతా వైరల్ అవ్వడానికి అందులో క్యాబ్ డ్రైవర్ ఏం పెట్టాడో తెలుసా?

Viral News: పాపం ఎన్ని చూసి ఉంటే ఇలా చేస్తాడు.. క్యాబ్ డ్రైవర్ గమ్మతైన కండిషన్..
Cab Driver's Variety Condit
Follow us on

మనం రోజు సోషల్ మీడియాలో ఆశ్చర్యకరమైన వార్తలు చూస్తూనే ఉంటాం.. సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడ ఏమి జరిగినా అది క్షణాల్లో వైరల్‌గా మారుతుంది. ఆ వీడియోల్లో కొన్ని మనకు నవ్వు తెప్పిస్తే మరికొన్ని షాక్‌కి గురిచేస్తాయి. తాజాగా అలాంటి ఓ సంఘటనే జరిగింది. అది ఓ క్యాబ్ డ్రైవర్ తన క్యాబ్‌లో విన్నూతంగా ఓ పోస్టర్‌ను పెట్టాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి.

హైదరాబాద్‌లో ఓ క్యాబ్ డ్రైవర్ తన కారులో ఓ పోస్టర్‌ను ఏర్పాటు చేశాడు. అందులో వార్నింగ్.. నో రొమాన్స్.. ఇది క్యాబ్.. ఇది ప్రైవేట్ ప్లేస్ లేదా ఓయో కాదు.. దయ చేసి డిస్టెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తూ సైలెంట్‌గా కూర్చోగలరు” అని పోస్టర్లో పేర్కొన్నాడు. ఈ పోస్టర్ వెనుక సీట్లో కూర్చునే వారికి క్లియర్‌గా కనబడేలా ఏర్పాటు చేశాడు. దాన్ని క్యాబ్‌లో ప్రయాణించిన ఓ వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు రకరకలుగా స్పందిస్తున్నారు. ఎన్ని చూశాడో… భరించలేక ఇలా వార్నింగ్ ఇచ్చాడని ఒక్క నెటిజన్ కామెంట్ చేశాడు. అంటే, క్యాబ్లో కూడా రొమాన్స్ చేస్తున్నారా అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. నాకు తెలియదండి బాబు, నేను ఈ ఊరికి కొత్త! ఇంకొ నెటిజన్ కామెంట్ చేశాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి