AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: జూబ్లీహిల్స్ మైనర్ల ట్రాప్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. వీడి తెలివితేటలు మామూలుగా లేవుగా!

జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికలను టార్గెట్ చేసి, ట్రాప్ చేసిన కేసులో ప్రధాన నిందితుడు అర్జున్ కోడూరి సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకున్నట్టు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మైనర్ అమ్మాయిలను వలలో వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు TV9 చేతికి అర్జున్ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌కు సంబంధించిన కీలక వివరాలు చిక్కాయి..

Hyderabad: జూబ్లీహిల్స్ మైనర్ల ట్రాప్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. వీడి తెలివితేటలు మామూలుగా లేవుగా!
Minor Girls Trap Case In Jubilee Hills
Vijay Saatha
| Edited By: |

Updated on: May 08, 2026 | 6:42 PM

Share

హైదరాబాద్‌, మే 8: నిందితుడు అర్జున్ తనను తాను ఓ సినిమా ప్రొడ్యూసర్‌గా పరిచయం చేసుకుంటూ తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో ప్రొజెక్ట్ చేసుకున్నాడు. గ్లామర్ ఫీల్డ్, సినిమా అవకాశాలు, ఇంటర్న్‌షిప్‌లు అంటూ యువతను ఆకర్షించేలా ప్రొఫైల్‌ను రూపొందించినట్టు తెలుస్తోంది. అర్జున్ అకౌంట్‌ను దాదాపు 6 వేల మంది ఫాలో అవుతున్నారు. అందులో ఎక్కువ శాతం మహిళా ఫాలోవర్లే ఉండటం గమనార్హం.

ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే “సమ్మర్ ఇంటర్న్‌షిప్” పేరుతో ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రొఫైల్‌లో పెట్టిన లింక్‌ను క్లిక్ చేస్తే నేరుగా ప్రత్యేక పేజీకి వెళ్లేలా సెటప్ చేసినట్టు తెలుస్తోంది. అక్కడ సర్టిఫికెట్‌లు ఇస్తామని, పనితీరు బాగుంటే రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు స్టైఫండ్ ఇస్తామని ప్రకటనలు పెట్టినట్టు సమాచారం. ఈ ఆఫర్లకు ఆకర్షితులై పలువురు మైనర్ అమ్మాయిలు గ్రూప్‌లో చేరినట్లు విచారణలో బయటపడుతోంది. సోషల్ మీడియా ద్వారా నమ్మకం కల్పించి, తర్వాత వ్యక్తిగతంగా టచ్‌లోకి వెళ్లి ట్రాప్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

అర్జున్ కోడూరి పేజ్‌ను 269 మంది రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నట్టు గుర్తించారు. వీరిలో పలువురు యువతులతో అతడు డైరెక్ట్ మెసేజ్‌ల ద్వారా సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఈ ఫాలోవర్ల నుంచే కొందరు బాధితులను టార్గెట్ చేసినట్టు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. సోషల్ మీడియాను కవర్‌గా ఉపయోగించి మైనర్లను టార్గెట్ చేసిన ఈ వ్యవహారం ఇప్పుడు నగరవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అర్జున్‌తో పాటు మరెవరైనా ఈ నెట్‌వర్క్‌లో ఉన్నారా..? సోషల్ మీడియా ద్వారా ఇంకెంతమంది యువతులను టార్గెట్ చేశారు..? అన్న కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌