Hyderabad: ఫ్యూచర్ సిటీలో భారీ ఎక్స్‌పో.. ఫైటర్ జెట్ల విన్యాసాలు.. 7 రోజుల పాటు సందడే సందడి.. ఎప్పటి నుంచి అంటే..

Hyderabad Mega Defence Expo: డీఆర్‌డీవో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, భారత్ డైనమిక్స్, మిధాని, ఈసీఐఎల్ లాంటి సంస్థలు రక్షా ఎక్స్‌పోలో పాల్గొంటాయి. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, ఎల్ అండ్ టీ, అదానీ ఏరోస్పేస్, కల్యాణి గ్రూప్ తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి..

Hyderabad: ఫ్యూచర్ సిటీలో భారీ ఎక్స్‌పో.. ఫైటర్ జెట్ల విన్యాసాలు.. 7 రోజుల పాటు సందడే సందడి.. ఎప్పటి నుంచి అంటే..
Hyderabad Mega Defence Expo

Updated on: Nov 29, 2026 | 9:47 PM

Hyderabad Mega Defence Expo: పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనే లక్ష్యంగా సాగుతోన్న కాంగ్రెస్ సర్కార్.. ఫ్యూచర్ సిటీలో భారీ రక్షా ఎక్స్‌పోకు ఏర్పాట్లు చేస్తోంది. ఏడు రోజుల పాటు జరిగే ఎక్స్‌కు దేశ, విదేశీ కంపెనీలను ఆహ్వానించింది. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ సందర్భంగా రక్షా ఎక్స్‌పో ప్రత్యేక ఆకర్షణగా మారబోతోంది. దేశంలోని రక్షణ, విమానయాన పరిశ్రమల్లో దాదాపు 30 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఈ రంగంలో తెలంగాణకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం కోసం గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా రక్షా ఎక్స్‌పోను నిర్వహిస్తోంది.

డిసెంబర్ 7నుంచి 13వ తేదీ వరకు రక్ష్సా ఎక్స్‌పో కొనసాగుతుంది. ఇందులో మొత్తం 130 సంస్థలు పాల్గొంటాయి. ఇందుకోసం 14,400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భారీ ప్రదర్శనశాల సిద్ధమవుతోంది. ఆరుబయట ప్రదర్శనలకు మరో 40 వేల చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించింది ప్రభుత్వం.

డీఆర్‌డీవో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, భారత్ డైనమిక్స్, మిధాని, ఈసీఐఎల్ లాంటి సంస్థలు రక్షా ఎక్స్‌పోలో పాల్గొంటాయి. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, ఎల్ అండ్ టీ, అదానీ ఏరోస్పేస్, కల్యాణి గ్రూప్ తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. అంతర్జాతీయంగా ప్రముఖ సంస్థలైన లాక్‌హీడ్ మార్టిన్, సఫ్రాన్, డసాల్ట్ సంస్థలు కూడా పాల్గొంటాయి. అంతరిక్ష, డ్రోన్ల తయారీ రంగాల్లో గుర్తింపు పొందిన స్కైరూట్, ధ్రువ స్పేస్, మారుత్ డ్రోన్స్ వంటి సంస్థలు ఇందులో పాలుపంచుకుంటాయి.

డిసెంబర్ 7, 8 తేదీల్లో భారత వాయుసేన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సూర్యకిరణ్, సారంగ్ బృందాలు ఇందులో పాల్గొంటాయి. భారత సైన్యం, నౌకాదళం ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. నౌకాదళ బ్యాండ్ ప్రదర్శన కూడా ఉంటుంది. డిసెంబర్ 10 నుంచి 13 వరకు ప్రజలు, విద్యార్థులు, ఎన్‌సీసీ క్యాడెట్లకు ప్రదర్శన సందర్శించే అవకాశం కూడా ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us