Hyderabad: అత‌డి ఆత్మహత్యకు వాక్సిన్ భయమే కారణమా? పోలీసుల దర్యాప్తు

|

Jun 15, 2021 | 7:19 AM

హైద‌రాబాద్ మణికొండలో విషాదం చోటుచేసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోమన్నందుకు శివ ప్రకాష్ అనే 21 ఏళ్ళ యువకుడు సూసైడ్ చేసుకున్నాడ‌ని....

Hyderabad: అత‌డి ఆత్మహత్యకు వాక్సిన్ భయమే కారణమా? పోలీసుల దర్యాప్తు
Suicide
Follow us on

హైద‌రాబాద్ మణికొండలో విషాదం చోటుచేసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోమన్నందుకు శివ ప్రకాష్ అనే 21 ఏళ్ళ యువకుడు సూసైడ్ చేసుకున్నాడ‌ని అత‌డి కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. క‌రోనా వ్యాక్సిన్ తీసుకోమని‌ ఒత్తిడి తేవడంతో బలవన్మరణానికి పాల్ప‌డిన‌ట్లు చెబుతున్నారు. కాగా విషం తాగి శివ ప్రకాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. మృత దేహానికి పోస్ట్ మార్టం పూర్తి చేయించి.. కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించారు. వాక్సిన్ వేయించుకోమన్నందుకే అత‌డు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌న్న కుటుంబ స‌భ్యుల వివ‌ర‌ణపై స్థానికుల నుంచి అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. పోలీసులు కూడా ఆ కుటుంబం గురించి ఇరుగు పొరుగువారిని వివ‌రాలు అడిగి తెలుసుకుంటున్నారు. వ్యాక్సిన్‌పై భ‌యం ఉండి అత‌డు అలా చేశాడా..? కుటుంబంలో స‌మ‌స్య‌లు ఏమైనా ఉన్నాయా..? లేక మ‌రోదైనా కోణం ఉందా అని పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. స్థానికంగా ఈ ఘ‌ట‌న చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మ‌న్ముందు విచార‌ణ‌లో కీల‌క విష‌యాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి.

Also Read: జోడెడ్ల‌లో ఒక‌టి త‌నువు చాలించింది.. ఆ ఇంటి బిడ్డే కాడెద్దుగా మారాడు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్ఐటీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. ఎవ‌రు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి..