
హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. 14 రోజుల చిన్నారిని గొంతు కోసి చంపేశాడు తండ్రి. నేపాల్‌కు చెందిన జగత్-గౌరీ.. గుల్షన్ కాలనీలో ఉంటున్నారు. వీరికి ఒక బాబు, ఇద్దరు అమ్మాయిలు సంతానం. రెండు సంవత్సరాల క్రితం బాబు చనిపోయాడు. బాబు మరణంపై కూడా అనుమానం వ్యక్తం చేస్తోంది భార్య గౌరీ. భర్త గత కొద్ది రోజుల నుంచి సైకోలా ప్రవర్తిస్తాడని భార్య పోలీసులకు చెప్పింది. రాత్రి నిద్రలో ఉన్న ఇద్దరు కూతుర్లని బయటకు తీసుకెళ్లాడని.. రెండు సంవత్సరాల పాప ముందే.. 14 రోజుల పసికందును గోంతు కోసం చంపాడని వాపోయింది. అతనిని ఖచ్చితంగా ఉరి తీయాలని ఆ తల్లి గర్భశోకంతో కన్నీళ్లు పెట్టుకుంది.
తల్లి గౌరీ ఇంట్లో నిద్రిస్తుండగా.. 14రోజుల పసికందును మరో కూతురు ముందే గొంతుకోసి చంపేశాడు కసాయి తండ్రి. ఆ తర్వాత చెత్తకుప్పలో పసికందు డెడ్‌బాడీని పడేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్య ఫిర్యాదుతో పోలీసులు జగత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిందితుడు ఇంతటి దారుణానికి తెగబడటానికి గల కారణాలను ఇంకా వెల్లడించలేదని పోలీసులు చెబుతున్నారు. పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..