Hyderabad: జనవరి నుంచే జలగండం..? జలాశయాల్లో జీరో లెవల్స్.. హైదరాబాద్ అంతటా పారాహుషార్

హైదరాబాద్‌లో నీటి సంక్షోభం.. ఎంత సీరియస్ అంటే.. మాటల్లో చెప్పలేనంత. దీపావళి సెలవులకు ఊర్లకు వెళ్లినవాళ్లు తిరిగి హైదరాబాద్‌కి రాక, హాస్టళ్లు-పీజీలు మూతబడే ఉన్నాయి. ట్యాంకర్ల ఖర్చు తడిసిమోపెడయ్యి, కార్పొరేట్ కాలేజీల క్యాంపస్‌లు క్లోజ్ చేసి కూర్చున్నారు. కొందరైతే నీళ్లు లేక, ఒంటికి సెంటు కొట్టుకుని ఆఫీసులకు వెళ్తున్నారు. అటు, ఓయూ క్యాంపస్‌కి నీటి సరఫరా తగ్గిస్తామని వాటర్ బోర్డ్ ముందుగానే ప్రకటించింది. మొత్తానికి విద్యా సంవత్సరం డిస్టర్బ్ అయ్యి, ఎకడమిక్ కాలెండర్‌ గజిబిజిగా మారే ప్రమాదముంది. ఇప్పుడే ఏమైంది.. మొత్తం హైదరాబాద్ లైఫ్‌స్టయిలే మారిపోతుంది. హైదరాబాద్‌లో వాటర్ హాలిడే ప్రకటించేరోజు ఎంతో దూరంలో లేదా? జనవరి తర్వాత భాగ్యనగరంలో దాహం-దాహం దృశ్యాలు తప్పవా, జలమండలి ఏమంటోంది? ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Hyderabad: జనవరి నుంచే జలగండం..? జలాశయాల్లో జీరో లెవల్స్.. హైదరాబాద్ అంతటా పారాహుషార్
Hyderabad Water Crisis

Updated on: Nov 27, 2026 | 10:03 PM

జలాశయాల్లోని నిల్వలు 80 రోజులకు మాత్రమే సరిపోతాయ్.. వర్షాలు పడకపోతే డిసెంబర్ చివరికి రోజు విడిచి రోజు కూడా నల్లాల్లో నీళ్లు రావు.. గ్రేటర్ శివారు మున్సిపాలిటీల్లో 4 లక్షల ఇళ్లకు పైప్‌లైన్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది.. భూగర్భ జలమట్టాలు 2 నుంచి 4 మీటర్లు పడిపోయాయ్.. మిషన్ భగీరథ సరఫరాపై ఒత్తిడి పెరుగుతోంది..రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్సే లేదన్న వాతావరణశాఖ. భయపెడుతున్న లెక్కలన్నీ భాగ్యనగరాన్ని వెంటాడుతున్నాయి. ఔను, ఎల్‌నినో రక్కసి కరాళనృత్యం నిజం, భీకరమైన వర్షపాతం లోటు నిజం, భూగర్భజలాలు ఇంకిపోతున్నమాట నిజం, జలమండలి ముందస్తు హెచ్చరికలు నిజం. ఇవన్నీ నిజాలైనప్పుడు జనవరి నుంచి మహానగరంలో నీటి కరువు కూడా నిజమేగా? ఆ నిజమే ఇప్పుడు జనాన్ని నీడలా వెంటాడుతోందా? ఔను, భాగ్యనగరానికి దాహం తీర్చే దారులన్నీ దాదాపుగా మూసుకుపోయినట్టే కనిపిస్తోంది. భాగ్యనగరంలో రోజుకు మూడు అడుగుల చొప్పున భూగర్భజలం ఇంకిపోతోంది. 1200 అడుగుల లోతుకి బోర్ వేసినా తడి తగలని పరిస్థితి. అంతోఇంతో వాన పడినా, ఆ చినుకును లోపలికి తీసుకుని జీర్ణించుకోడానికి అంగుళమంత భూమి కూడా ఖాళీ లేకుండా, 90 శాతానికి పైగా నగరాన్ని కాంక్రీట్‌తో నింపేశారు జనం. అందుకే, అత్యవసర పరిస్థితుల్లో నీటి జాడ కోసం ఇన్నేసి తిప్పలు. అటు, ఉస్మాన్ సాగర్, సింగూర్, హిమాయత్ సాగర్, మంజీరా నదుల్లో నీటిమట్టాలు డెడ్‌స్టోరేజ్‌కి దగ్గరయ్యాయి. గత ఏడాదితో పోలిస్టే 80 శాతం లోటు...

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి