
హైదరాబాద్ వాసులకు భారీ శుభవార్త. వాట్సప్‌లో ఇక నుంచి సులువుగా జీహెచ్‌ఎంసీ సేవలు పొందవచ్చు. ఈ మేరకు మీ సేవా సంస్థ కొత్త సదుపాయాలను నగర ప్రజల కోసం ప్రారంభించింది. జీహెచ్‌ఎంసీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సులువుగా వాట్సప్ ద్వారా ప్రజలు సేవలు పొందవచ్చు. ప్రస్తుతం 9 రకాల సేవలను వాట్సప్ మీ సేవ, చాట్‌బాట్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. మంత్రి శ్రీధర్ బాబు సూచనల మేరకు ఈ కొత్త సేవలను అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ప్రజలు మీ సేవ కేంద్రాలను సంప్రదించకుండానే వాట్సప్ ద్వారా సేవలు పొందవచ్చు.
ఆస్తి పన్ను సవరణ, డేట్ ఆఫ్ బర్త్‌తో పాటు డెట్ సర్టిఫికేట్‌లో మార్పులు, హోం బర్త్, హోం డెత్, ఇంటి నెంబర్ సవరణ, మ్యూటేషన్, ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ వంటి జీహెచ్‌ఎంసీ సేవలు వాట్సప్ ద్వారా పొందవచ్చు. ప్రస్తుతం ఈ సేవల కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. అయితే వాట్సప్ సేవల వల్ల సమయం, డబ్బులు ఆదా కానున్నాయి. ఇంటి వద్ద కూర్చోనే జీహెచ్‌ఎంసీ సేవలు పొందవచ్చు. మీ సేవ వెబ్ సైట్లోని చాట్ బాట్‌ను ఉపయోగించి కూడా సేవలను యాక్సెస్ చేయవచ్చని అధికారులు తెలిపారు. ఈ ఫీచర్ ద్వారా ట్రాఫిక్ చలాన్, ఇన్ కమ్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ సర్టిఫికేట్, విద్యుత్ బిల్లు వంటి సేవలను ప్రజలు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు.
– 8096958096 నెంబర్‌ను మీ సేవ తెలంగాణ పేరుతో సేవ్ చేసుకోండి
-వాట్సప్ ఓపెన్ చేసి హాయ్ అని మెస్సేజ్ పెట్టండి
-ఏ సర్వీస్ కావాలో ఎంచుకోండి
-మెనూలో ఓపెన్ సర్వీస్ ఆప్షన్ ఎంచుకోండి
-దరఖాస్తు వివరాలు నింపండి
-దరఖాస్తు రుసుం చెల్లించండి