Hyderabad: హైదరాబాద్ ప్రజలు బీ అలర్ట్.. నేడు ఈ ఏరియాల్లో విద్యుత్ సరఫరా బంద్.. ఎక్కడెక్కడంటే..?

హైదరాబాద్ ప్రజలకు విద్యుత్ అధికారులు అలర్ట్ జారీ చేశారు. పలు ప్రాంతాల్లో నేడు విద్యుత్ కోత విధించనున్నారు. శుక్రవారం భారీ వర్షంతో నగరంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ ఫీడర్లలో సమస్య తలెత్తింది. దీంతో మరమ్మత్తులు చేపట్టాల్సి ఉండటంతో నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా బంద్ చేయనున్నారు.

Hyderabad: హైదరాబాద్ ప్రజలు బీ అలర్ట్.. నేడు ఈ ఏరియాల్లో విద్యుత్ సరఫరా బంద్.. ఎక్కడెక్కడంటే..?
Power Cuts

Updated on: Oct 31, 2026 | 8:19 AM

హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్. విద్యుత్ ఫీడర్లలో సాంకేతిక సమస్యల కారణంగా నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా బంద్ కానుంది. శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ ఫీడర్లలో మరమ్మత్తులు చేపట్టాల్సి ఉంది. దీంతో ఈ కారణంగా నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ కోత విధించనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. వినియోగదారులు దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ప్రజలు ముందుగానే గమనించి ముందస్తు ఏర్పాట్లు చూసుకోవాలని అధికారులు సూచించారు. విద్యుత్ కోత వల్ల నగరంలోని పలు ప్రాంతాల ప్రజలు అసౌకర్యానికి గురి కానున్నారు. ఏయే ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండడంటే..

ఈ ప్రాంతాల్లో బంద్..

మౌలాలి సబ్ స్టేషన్ పరిధిలోని జవహర్ నగర్ ఫీడర్‌లో మరమ్మత్తుల కారణంగా జవహర్ నగర్, కృష్ణవేణి నగర్, రాఘవేంద్ర నగర్, కాస్తుర్బానగర్, వసంత్ విహార్ కాలనీ, ఏపీఐఐసీ కాలనీలతో పాటు సమీప ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా బంద్ కానుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.30 గంటల వరకు కోత విధించనున్నట్లు అధికారులు ప్రకటించారు. వినియోగదారులు దీనిని గమనించి తమకు సహకరించాలని సూచించారు. ఇక గోకుల్ నగర్ విద్యుత్ ఫీడర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా మరమ్మత్తులు చేపట్టాల్సి ఉంది. ఈ కారణంతో పార్వతీనగర్, గోకుల్ నగర్, శారదా ఆస్పత్రి, వాటర్ వర్క్స్ ఏరియా, అంకురా ఆస్పత్రి, హెచ్ఐజీ-ఏ ప్రాంతాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ కోత ఉంటుందని స్పష్టం చేసింది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. దీని వల్ల విద్యుత్‌ ఫీడర్లలో పలు ప్రాంతాల్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. వీటికి మరమ్మత్తులు నిర్వహించాల్సి ఉండటంతో పలు ప్రాంతాల్లో నేడు కోత విధించనున్నారు.

అటు ఎల్‌నివో పరిస్థితుల రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీని వల్ల విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. ఎండల కారణంగా ప్రజలు ఏసీలు, కూలర్లు ఎక్కువ వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్ డిమాండ్ పెరుగుతుండగా.. పొదుపు చర్యలు పాటించాలని తెలంగాణ ప్రభుత్వం సూచిస్తోంది.  పెరుగుతున్న డిమాండ్ కారణంగా రానున్న రోజుల్లో తెలంగాణలో విద్యుత్ కోతలు కూడా ఏర్పడే అవకాశముంటుంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్‌నివో ప్రభావం వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు కొనసాగే అవకాశముంది. దీంతో విద్యుత్ కోతలు మరింతగా పెరిగే అవకాశముంది. పెరిగిన డిమాండ్ కారణంగా విద్యుత్ సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. దీంతో విద్యుత్ లైన్ల సామర్థ్యాన్ని పెంచనుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us