Hyderabad: హైదరాబాద్‌లో భారీ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఈ ప్రాంతంలోనే ఫిక్స్.. రాష్ట్రంలోనే తొలిసారి..

ఎల్బీనగర్-హయత్ నగర్ ఎలివేటెడ్ కారిడార్‌పై కీలక అప్డేట్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ మేరకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. అలాగే హైదరాబాద్-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి డీపీఆర్ సిద్దం చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

Hyderabad: హైదరాబాద్‌లో భారీ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఈ ప్రాంతంలోనే ఫిక్స్.. రాష్ట్రంలోనే తొలిసారి..
Lb Nagar

Updated on: Oct 19, 2026 | 9:21 PM

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎల్బీనగర్-హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌కు ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు, రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్-హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌తో పాటు తెలంగాణలోని ఇతర రహదారులు, ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్-హయత్ నగర్ డబుల్ డెక్కర్ ప్రాజెక్ట్‌కు కేంద్రమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక కృష్ణా నదిపై నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి కూడా నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. ఇక హైదరాబాద్-శ్రీశైలం హైవేపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి డీపీఆర్ సిద్దం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణలో ఐదు రోప్ వేలకు కేంద్రం ఆమోదం తెలిపింది. పర్వతమాల ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో 5 రోప్ వేలకు నితిన్ గడ్కరీ ఆమోదముద్ర వేశారు. ఇక హైదరాబాద్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంపై నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కృష్ణానదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి శంకుస్థాపన ప్రతిపాదనకు గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రత్యేక భేటీలో తెలంగాణలోని కీలక ప్రాజెక్టులపై చర్చ జరిగింది. అన్ని విషయాలపై నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి వల్ల ఏపీ, తెలంగాణ మధ్య అనుసంధానం మరింత పెరగనుంది. దీని వల్ల రవాణా, పర్యటానికి ఉపయోగపడనుంది. ఇక హైదరాబాద్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే వల్ల రెండు ప్రధాన నగరాలకు కనెక్టివిటీ పెరగనుంది. ఎల్బీనగర్-హయత్ నగర్ మధ్య 7.1 కిలోమీటర్ల మేర ఈ ఫ్లైఓవర్ ఉంటుంది. డబుల్ డెక్కర్ మోడల్‌లో దీనిని నిర్మించనున్నారు. నాగ్‌పూర్‌లో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మల్టీ లైటర్ డబుల్ డెకర్ విధానంలో ఉంటుంది. కింద సాధారణ రోడ్లు ఉండనుండగా.. మధ్యలో మూడు లైన్ల ఫ్లైఓవర్, పైభాగంలో మెట్రో రైళ్లు వెళ్లేలా డిజైన్ చేయనున్నారు.

ఈ ఎలివేటెడ్ కారిడార్ వల్ల ఎల్బీనగర్, హయత్ నగర్ మధ్య ట్రాఫిక్ భారీగా తగ్గనుంది. ప్రస్తుతం ఈ రూట్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్బీనగర్, హయత్ నగర్ మధ్య అనేక కాలనీలు ఉండగా.. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ రెండు ప్రాంతాల మధ్య ఫ్లైఓవర్ నిర్మించాలనే ప్రతిపాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఇప్పుడు ఎట్టకేలకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో మార్గం సుగమమైందని చెప్పవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us