హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్.. మన గాలి మంచిదేనట..!

| Edited By:

Nov 13, 2019 | 10:04 AM

ఈ న్యూస్ హైదరాబాద్‌ వాసులకు నిజంగానే శుభవార్త అనే చెప్పాలి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజాగా.. మరోసారి భారతదేశంలో ముఖ్యమైన నగరాలు, పట్టణాల్లో వాయు కాలుష్యం టెస్ట్ నిర్వహించింది. ఈ టెస్ట్‌‌లో.. ‘హైదరాబాద్‌’ సేఫ్‌ అని వచ్చింది. దీంతో.. నిజంగానే నగరవాసులు ఊపిరి పీల్చుకోవచ్చన్నమాట. ఇప్పుడు ఎక్కడ విన్నా వాయు కాలుష్యం అనే మాటే వినబడుతోంది. ముఖ్యంగా ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో.. ఇక చెప్పనక్కర్లేదు. వాయు కాలుష్యంలో ఆ నగరం రెడ్‌ జోన్‌లో ఉంది. అక్కడి […]

హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్.. మన గాలి మంచిదేనట..!
Follow us on

ఈ న్యూస్ హైదరాబాద్‌ వాసులకు నిజంగానే శుభవార్త అనే చెప్పాలి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజాగా.. మరోసారి భారతదేశంలో ముఖ్యమైన నగరాలు, పట్టణాల్లో వాయు కాలుష్యం టెస్ట్ నిర్వహించింది. ఈ టెస్ట్‌‌లో.. ‘హైదరాబాద్‌’ సేఫ్‌ అని వచ్చింది. దీంతో.. నిజంగానే నగరవాసులు ఊపిరి పీల్చుకోవచ్చన్నమాట.

ఇప్పుడు ఎక్కడ విన్నా వాయు కాలుష్యం అనే మాటే వినబడుతోంది. ముఖ్యంగా ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో.. ఇక చెప్పనక్కర్లేదు. వాయు కాలుష్యంలో ఆ నగరం రెడ్‌ జోన్‌లో ఉంది. అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకునేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. దీంతో.. ఆక్సిజన్‌ను కూడా.. కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే.. కోల్‌కతా కూడా.. ఢిల్లీ తర్వాతి స్థానంలో ఉన్నట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) వెల్లడించింది. కాగా.. ముఖ్యంగా ఉత్తరాది నగరాల్లో కాలుష్యం మరింత ప్రమాదకరంగా మారుతోంది. అందులోనూ.. ఇప్పుడు వచ్చేది చలికాలం కాబట్టి.. కాలుష్యం మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే.. దక్షిణాది రాష్ట్రాలు కూడా వాయు కాలుష్యంలో సేఫ్ జోన్‌లో ఉన్నట్టు నివేదికలో వెల్లడించారు నిపుణులు.

జాతీయ వాయు ప్రమాణాల సూచి ప్రకారం.. 2.5 మైక్రాన్ల పరిమాణంలో 40 మైక్రోగ్రాముల దుమ్ముకణాలు ఉండాలి. అంటే.. గాలిలోని దుమ్ము, ధూళిని క్యూబిక్ మీటర్‌లో కొలుస్తారు. కాగా.. మిగిలిన నగరాలతో పోల్చితే.. హైదరాబాద్‌లో.. అది 50 మైక్రోగ్రాములుగా ఉన్నట్లు తేలింది. 10 మైక్రాన్ల పరిమాణంలో 60 మైక్రోగ్రాములు ఉండాల్సి ఉండగా.. హైదరాబాద్‌లో 100 మైక్రోగ్రాములుగా ఉంది. అలాగే.. నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్ సాధారణ స్థాయి కంటే 4 పాయింట్లు ఎక్కువగా ఉంది.. అందుకే హైదరాబాద్‌ సేఫ్ జోన్‌లో ఉందట. అయితే.. ట్రాఫిక్ పెరుగుదల, పరిశ్రమల కాలుష్య ఉద్గారాలు, రోడ్డుపై ధూళి, దుమ్ము విస్తరించడం వంటి కారణాలతో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.