
ఓ వైపు రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్ రహిత స్టేట్‌గా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే.. కొందరు కేటుగాళ్లు మాత్రం కాసులకు కక్కుర్తి పడి అధికారుల కళ్లు గప్పి రాష్ట్రంలోకి అక్రమంగా గంజాయిని తీసుకొస్తున్నారు. తాజాగా ఇలానే అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఓ గ్యాంగ్‌ను పట్టుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. నగరంలో గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న విశ్వసనీయమైన సమాచారంతో హైదరాబాద్‌లోని పెట్ బషీరాబాద్ సమీపంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా అటుగా వెళ్తున్న ఓ ఆటోను ఆటోరిక్షాను ఆపిన పోలీసులు.. దానిలోపల చెక్ చేయగా షాకింగ్ సీన్ వెలుగు చూసింది. ఆటోలో ఉన్న స్పీకర్ బాక్స్‌లో చాకచక్యంగా దాచి 6 కిలోల గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
బాక్స్ మొత్తం ఓపెన్ చేసి అందులో ఉన్న సుమారు 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ అక్రమరవాణాలకు పాల్పడిన ఐదుగురు డ్రగ్ పెడ్లర్లను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ముఠా సరఫరా కోసం నాగ్‌పూర్ నుండి గంజాయిని తెప్పించిందని పోలీసులు చెబుతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.