Hyderabad: ఇది హత్యాయత్నామా..? యాక్సిడెంటా..? సీసీ కెమెరాలో రికార్డయిన షాకింగ్ వీడియో

ఇది హత్యాయత్నమే అని స్థానికులు చెబుతున్నారు. కుటుంబసభ్యులు మాత్రం ఇది రోడ్డు ప్రమాదంగానే చెబుతుండడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు ఎంక్వైరీ ప్రారంభించారు.

Hyderabad: ఇది హత్యాయత్నామా..? యాక్సిడెంటా..? సీసీ కెమెరాలో రికార్డయిన షాకింగ్ వీడియో
Hyderabad Accident
Follow us

|

Updated on: Jul 07, 2022 | 12:02 PM

Accident Video: హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రమాదంపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజేంద్రనగర్‌(Rajendranagar) పోలీస్ స్టేషన్ పరిధిలో చింతల్​మెట్​ హకీం హిల్స్ వద్ద  రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న యువతిపై గుర్తు తెలియని కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ యువతి ఆసుపత్రి పాలైంది. బధవారం మధ్యాహ్నం ఒంటి గంట 12 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. కారు సడెన్‌గా వచ్చి యువతిని ఢీ కొట్టింది. రక్తపు మడుగులో పడి ఉన్న యువతిని గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. తలకు బలమైన గాయమైందని వెల్లడించారు. ఒక్కసారి సీసీటీవీ పుటేజీ చూడండి. కావాలనే యువతిని ఢీ కొట్టారా? అనే అనుమానాలు మొదలయ్యాయి. ప్రమాదమా? లేక ఆమెను చంపేందుకు ప్లాన్‌ వేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు సుమియా బేగం(19) టైలరింగ్  ట్రైనింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

రెండో వీడియో బాగా గమనించండి. గల్లీలో వెళ్లడానికి వచ్చిన కారు రివర్స్‌ తీసుకుంది. ఆ తర్వాత ఒక్కసారి ఎక్స్‌లేటర్‌ తొక్కడంతో కంట్రోల్‌ కాలేదు. దీంతో అటూ ఇటూ తిరిగి యువతిపై దూసుకెళ్లింది. దీంతో ఇప్పుడు అనుకోకుండా జరిగిన ప్రమాదామా? లేక ఆ యువతి హత్యకు వేసిన ప్లానా? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇంతకీ ఆ కారు ఎవరిది? అందులో ఉన్న వారెవరు? అక్కడికి వారు ఎందుకు వచ్చారు? అనే వివరాలు తెలిస్తే ఈ మిస్టరీ వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన విజువల్స్ ఆధారంగా కారులో ఉన్నవారిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. యువతిని ప్రేమించిన వ్యక్తే హత్యకు యత్నించాడని స్థానికులు చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.