హోటళ్లలో మీరు లొట్టలు వేసుకుంటూ తినే చికెన్ బిర్యానీ ఫ్రెష్ ఏనా? మీరు కర్రీ పాయింట్లలో కొన్న చికెన్ మంచిదేనా? జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో ఒక్క చికెన్ షాపులోనే 700 కిలోల కుళ్లిన చికెన్ దొరకడం ఇలాంటి అనుమానాలకు తావిస్తుంది.
హైదరాబాద్ బేగంపేటలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తుపోయారు. బాలయ్య చికెన్ సెంటర్లో పెద్ద మొత్తంతో కుళ్లిపోయిన చికెన్ స్వాధీనం చేసుకున్నారు. 700 కిలోల కుళ్లిన చికెన్ సీజ్ చేశారు. కుళ్లిన చికెన్‌కు కెమికల్స్ కలిపి అమ్మకాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. ఈ చికెన్‌ను హోటళ్లు, జనతా బార్లు, కర్రీ పాయింట్లకు విక్రయిస్తున్నారట. బాలయ్య చికెన్ సెంటర్ సీజ్ చేసిన అధికారులు, యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు.
ఇది కలికాలం కాదు.. కల్తీకాలం అన్నట్టుగా మారింది. ఎక్కడ చూసినా నకిలీ వస్తువులు, కల్తీ సరుకులే.. ఏది ముట్టుకోవాలన్నా భయం.. ఏది తినాల్నా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా కల్తీ సరుకులకు అడ్డాగా మారింది హైదరాబాద్. అందుకే బయట ఏం తింటున్నా, తాగతున్నా ఒకటికి.. రెండుసార్లు చెక్ చేస్కోండి. ఎవరైనా కల్తీ వస్తువులు తయారుచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..