Rain Alert: తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

ఈ ప్రభావంతో మంగళవారం ఉమ్మడి నిజామాబాద్‌, ఖమ్మం, నల్గొండ, వరంగల్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌ నగర్​, నిర్మల్‌ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈనేపథ్యంలోనే ఈ జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. కాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. వాయువ్య దిశగా కదులుతూ..

Rain Alert: తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
Rain Alert

Updated on: Oct 15, 2024 | 6:59 AM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. చక్రవాతపు ఆవర్తనం దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద పశ్చిమ – మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కేంద్రీకృతమైందన్న వాతావరణ శాఖ అధికారులు, దీని ప్రభావంతో రాష్ట్రంలో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని తెలిపారు.

ఈ ప్రభావంతో మంగళవారం ఉమ్మడి నిజామాబాద్‌, ఖమ్మం, నల్గొండ, వరంగల్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌ నగర్​, నిర్మల్‌ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈనేపథ్యంలోనే ఈ జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. కాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. వాయువ్య దిశగా కదులుతూ మరింత బలంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

మంగళవారం ఉదయం వరకు మధ్యబంగాళాఖాతం వరకు చేరుతుందని.. ఆ తర్వాత రెండురోజుల్లో మరింత ముందుకు కదులుతూ పశ్చిమ వాయువ దశగా కదులుతూ తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఏపీ తీరాలకు చేరే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు ఏపీలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 4 రోజులు అక్కడ భారీ నుంచి కుండపోత వానలు కురవొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇదిలా ఉంటే సోమవారం హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం కురిసింది. ముఖ్యంగా కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, ఆల్విన్‌ కాలనీ, ప్రగతినగర్‌, సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు, వికారాబాద్‌ జిల్లా తాండూరు, బహదూర్‌పల్లి, సూరారం, గుండ్ల పోచంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వాహనదారులు ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us