Hyderabad: ఇంట్లో గడియ పెట్టుకుని బయటకు రాని లేడీ డాక్టర్.. తొంగి చూసి అంతా షాక్!

హైదరాబాద్ కుషాయిగూడలో డాక్టర్ కాక కీర్తి (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. ఆమె తన అద్దె ఇంట్లో ఉరివేసుకుని విగతజీవిగా కనిపించారు. బంధువుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కీర్తి మృతి ఆత్మహత్యా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.

Hyderabad: ఇంట్లో గడియ పెట్టుకుని బయటకు రాని లేడీ డాక్టర్.. తొంగి చూసి అంతా షాక్!
Hyderabad Lady Doctor

Updated on: Sep 07, 2026 | 9:51 PM

హైదరాబాద్: కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ మహిళా డాక్టర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. వైష్ణవి ఎంక్లేవ్‌లోని ఆమె అద్దెకు ఉంటున్న ఇంట్లో డాక్టర్ కాక కీర్తి (28) ఉరివేసుకున్న స్థితిలో మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు, బంధువుల తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతికి చెందిన కీర్తి హైదరాబాద్‌లో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. కుషాయిగూడ పరిధిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవలే రాఘవ అనే వ్యక్తితో ఆమెకు వివాహం జరిగినట్లు కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపారు. అయితే, కీర్తి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఉన్న విషయాన్ని బంధువులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదికతో పాటు ఘటనాస్థలిలో లభించిన ఆధారాలు, కుటుంబ సభ్యులు, బంధువుల వాంగ్మూలాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కీర్తి మృతికి అసలు కారణం ఏమిటి? ఆమె ఆత్మహత్యకు పాల్పడటానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? లేక ఘటనకు సంబంధించి మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఆమె వ్యక్తిగత, కుటుంబ పరిస్థితులపై కూడా వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కీర్తి మృతి ఆత్మహత్యా, మరేదైనా కారణమా అన్నది స్పష్టంగా తెలియరాలేదు. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు తెలిపారు. ఈ అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us