Bomb Threat: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని విమానానికి బాంబ్ బెదిరింపు

Bomb Threat to Ahmedabad-Hyderabad Flight: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మరోసారి బాంబ్‌ బెదిరింపు కలకలం రేపింది. ఎయిర్‌పోర్టులో ఉన్న ఓ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే.. విమానాన్ని ఐసోలేషన్‌కు తరలించి.. బాంబ్‌ స్క్వాడ్ సహాయంతో తనిఖీ చేపట్టారు. ప్రస్తుతం విమానంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.

Bomb Threat: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని విమానానికి బాంబ్ బెదిరింపు
Ahmedabad Hyderabad Flight Receives Bomb Threat

Updated on: Oct 17, 2026 | 7:27 AM

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మరోసారి బాంబ్‌ బెదిరింపు కలకలం రేపింది. ఎయిర్‌పోర్టులో ఉన్న ఓ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. అహ్మదాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తున్న ఇండిగో (6E6728) విమానానికి బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేగింది.

హైదరాబాద్‌కు చెందిన సుచిత్ర అకాడమీ స్కూల్ విద్యార్థులు 47 మంది ఎక్స్‌కర్షన్‌కు వెళ్లి తిరిగి ఇదే విమానంలో ప్రయాణిస్తున్నారు. ప్రయాణ సమయంలో విమానంలో ఉన్న ఓ విద్యార్థిని విమానంలో బాంబు ఉంది అని చెప్పడంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు రంగంలోకి దిగారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అయిన వెంటనే రన్‌వేపై అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అనంతరం ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించి, విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. అక్కడ బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us