Farming Idea: 70 రోజుల్లో కాపు.. ఎకరానికి 10 టన్నుల దిగుబడి! రైతును రాజును చేసే పంట!

తక్కువ పెట్టుబడి ఎక్కవ లాభంతో పాటు తక్కువ కాలంలోనే పంట చేతికి రావాలిని చాలా మంది రైతులు అనుకుంటారు. అలాంటి వారికి బీట్ రూట్ సాగు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. అవును ఈ పంటను జస్ట్ 70 రోజుల్లోనే సాగు చేయవచ్చని రైతులు చెబుతున్నారు. మరీ ఈ పంటను ఎలా సాగు చేయాలి. దీనికి కావాల్సిన ఎరువు, లాభాలు, ఖర్చులు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

Farming Idea: 70 రోజుల్లో కాపు.. ఎకరానికి 10 టన్నుల దిగుబడి! రైతును రాజును చేసే పంట!
Beetroot Farming In 70 Days

Updated on: Nov 27, 2026 | 1:38 PM

తక్కువ రోజుల్లో పంచచేతికి రావాలనుకునే రైతులకు బీట్రూట్ సాగు ఒక లాభదాయకమైన అవకాశంగా మారుతోంది. ముఖ్యంగా తెలంగాణలో వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ యువ రైతు కేవలం 70 రోజుల్లో బీట్రూట్ సాగు చేసి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో అధిక దిగుబడి సాధిస్తున్న ఆయన తమ సాగు అనుభవాలను పంచుకున్నాడు. ఈ పంట క్యారెట్, క్యాబేజీ వంటి పంటల కంటే ఎక్కువ లాభదాయకమని, శ్రమ కూడా తక్కువని ఆయన చెబుతున్నాడు.

విత్తనా ఎంపిక

బీట్రూట్ సాగుకు మంచిగా రావాలంటే వర్షపు నీరు నిలవని, నీటిపారుదల గల రేగడి భూములు కావాలి. మీరు నేలను చదును చేసి పైపులు, స్పింక్లర్లు ఏర్పాటు చేసుకోవాలి. నీరు ఎక్కువైతే పంట దెబ్బతింటుంది కాబట్టి జాగ్రత్త వహించాలి. అలాగే మీకు దిగుబడి మంచిగా రావాలంటే రసాయనాలతో శుద్ధి చేసిన అశోక, సకాటా, షుగర్ క్వీన్ వంటి నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలి. రాళ్ల మాదిరిగా చిన్నగా, ఎరుపు, నీలం రంగులలో ఉండే ఈ విత్తనాలు ఎకరాకు 300 గ్రాముల చొప్పున 15 డబ్బాలు విత్తుకోవాలి. క్యారెట్ మాదిరిగానే నేరుగా విత్తనాలను జల్లుకోవాలి. గడ్డలు బాగా ఊరడానికి విత్తనాల మధ్య దూరం పాటించడం అత్యవసరం, లేదంటే కేవలం ఆకులు మాత్రమే పెరుగుతాయి. విత్తనం జల్లిన 7 నుండి 8 రోజుల్లో మొలకలు వస్తాయి.

కలుపు నివారణకు విత్తనం జల్లిన వెంటనే స్టాంపెస్టర్ లేదా ఇతర కలుపు మందు పిచికారీ చేస్తే 40 రోజుల వరకు కలుపు రాదు. ఆ తర్వాత కొద్దిపాటి కలుపు వస్తే కూలీలతో తీయించుకోవచ్చు. ఎరువుల విషయానికి వస్తే ప్రారంభంలో డీఏపీ, ఆ తర్వాత కాంప్లెక్స్ ఎరువులు వేయాలి. గడ్డ బాగా ఊరడానికి, మంచి రంగు రావడానికి 30-35 రోజుల తర్వాత పొటాష్ జల్లుకోవాలి. వర్షాకాలంలో విత్తనం జల్లినప్పుడు స్పింక్లర్ల ద్వారా ఒకటి లేదా రెండుసార్లు నీరు అందిస్తే సరిపోతుంది.

పంట కోత, మార్కెటింగ్

70 రోజుల్లో పంట కోతకు వస్తుంది. ఒక్కో గడ్డ 400 నుండి 700 గ్రాముల వరకు బరువు ఉంటుంది. అయితే హోటళ్లు, రెగ్యులర్ కస్టమర్లు పెద్ద గడ్డలను అంతగా ఇష్టపడరు కాబట్టి 500 గ్రాముల లోపు గడ్డలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. కోత సమయంలో కూలీలు గడ్డలను తీసి ఆకులను కత్తిరిస్తారు. వర్షం పడినప్పుడు గడ్డలను నీటిలో కడిగి శుభ్రం చేసి, 70 కిలోల బస్తాలలో నింపుతారు. అక్కడి నుంచి మార్కెట్‌ యార్డ్‌లకు తరలించి విక్రయించాలి.

పెట్టుబడి, లాభాల లెక్కలు

పెట్టుబడి: మీరు ఎకరం భూమిలో ఈ పంట సాగు చేయాలి అంటే మీకు 3కేజీల వితనాలు కావాలి. 300 గ్రాముల ప్యాకెట్‌కు రూ. 1,400 కాబట్టి ఎకరానికి మీకు 30 వేల వరకు ఖర్చు రావచ్చు.

దిగుబడి: మీరు ఎకరం సాగులో దాదాపు 70 కిలోల బస్తాలు 150 నుండి 200 వరకు వస్తాయి.

ఆదాయం: మార్కెట్లో కిలో ధర రూ. 13 నుండి రూ. 17 వరకు ఉన్నా మీరు ఎకరానికి లక్ష నుండి లక్షన్నర రూపాయల వరకు లాభం పొందవచ్చని రైతులు చెబుతున్నారు.

గమనిక: అయితే ఈ సాగులో లాభంతో పాటు రిస్క్ కూడా ఉంటుంది కాబట్టి కొత్తగా సాగు చేసేవారు ఎకరం లోపు తక్కువ విస్తీర్ణంలో ప్రారంభించడం మంచిదని రైతులు చెబుతున్నారు. అలాగే మార్కెట్‌కు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో సాగు చేయడం వల్ల రవాణా ఖర్చులు తగ్గుతాయి. మీరు ఈ పంట వేయాలి అనుకుంటే మీ దగ్గర్లోని వ్యవసాయ అధికారులను సంప్రదించండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us