ఆదిలాబాద్ లో కన్నుల పండుగగా ఆరట్టు ఉత్సవం.. శరణుగోషతో మారుమోగిన పురవీధులు

ఉమ్మడి ఆదిలాబాద్‌లోని ప్రముఖ బెల్లూరి శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయం ఆరట్టు ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి సుప్రభాతసేవ అనంతరం, ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి పట్టణ పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం పెనుగంగా తీరంలో అభిషేకం చేసి ప్రత్యేక హారతినిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు.

ఆదిలాబాద్ లో కన్నుల పండుగగా ఆరట్టు ఉత్సవం.. శరణుగోషతో మారుమోగిన పురవీధులు
Belluri Ayyappa Arattu Utsavam

Edited By:

Updated on: Nov 29, 2026 | 11:19 AM

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనే ప్రముఖ అయ్యప్ప ఆలయమైన బెల్లూరి శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయ ఆరట్టు ఉత్సవం కన్నులపండువగా సాగింది. ఉదయం స్వామివారికి సుప్రభాతసేవ, విశేష అలంకరణ తో పూజ కార్యక్రమం నిర్వహించారు నిర్వహకులు. ఆరట్టు ఉత్సవంలో భాగంగా స్థానిక శ్రీ రామచంద్ర గోపాల కృష్ణ మఠం నుంచి ఆదివారం ప్రారంభమైన ఆరట్టు ఉత్సవం పట్టణ పురవీధుల గుండా కొనసాగింది. మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామీ ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులు చేపట్టిన ఆరట్టు ఉత్సవం అంగరంగ వైభవంగా సాగింది.

ముందుగా అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి పట్టణ పురవీధుల గుండా ఊరేగించారు. శోభాయాత్రలో అయ్యప్ప దీక్షదారులు, భక్తుల భజన కీర్తనలు, అయ్యప్ప స్వామి నామస్మరణతో పట్టణ పురవీధుల మారుమ్రోగాయి. కేరళ ప్రత్యేక డోలు వాయిద్యాలు శోభాయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎమ్మెల్యే పాయల్ శంకర్ శోభయాత్రలో పాల్గొని అయ్యప్ప మాలదారులతో కలిసి ఆడిపాడారు. దారి పొడవునా మహిళలు భక్తులు పెద్ద ఎత్తున మంగళహారతులతో శోభయాత్రకు స్వాగతం పలికారు.

అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి మహారాష్ట్ర సరిహద్దులోని పెనుగంగా తీరానికి యాత్రగా పల్లకీసేవను తీసుకెళ్లారు. నదిలో స్వామివారికి వివిధ రకాల పువ్వులు, నదీజలం, పం చామృతంతో అభిషేకం చేసి ప్రత్యేక హారతినిచ్చారు. భక్తుల అయ్యప్ప నామ శరణుఘోషతో పెనుగంగా తీరమంతా మార్మోగింది.

అనంతరం ఆలయానికి చేరుకుని ఉంజల్‌ సేవ నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బెల్లూరి అయ్యప్ప స్వామి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చందా గణేష్, తిప్పర్తి సత్యం ఆద్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా కొనసాగింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us